ఇది నిజంగా మెగా ఫ్యాన్స్ కి చాలా చాలా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి . మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటిస్తే తెరపై చూడాలి అంటూ ఎప్పటినుంచో చాలామంది మెగా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.  ఆచార్య సినిమాలో నటించిన ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.  అయితే వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అంటూ ఫ్యాన్స్ బాగా కోరుకుంటున్నారు . ఆచార్య సినిమా తర్వాత డైరెక్టర్స్ ఎవరూ కూడా చరణ్ అలాగే చిరంజీవితో సినిమాలు తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు . కాగా ఇప్పుడు జాన్వి కపూర్ కి ఆ అదృష్టం దక్కినట్లు తెలుస్తుంది .


జాన్వి కపూర్ నటించబోయే సినిమాలో చిరంజీవి ఓ కీలక పాత్రలో మెరవబోతున్నట్లు సినిమా ఇండస్ట్రీలో న్యూస్ బాగా హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో రామ్ చరణ్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్ నటిస్తున్నారు . కాగా ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ కోసం ఒక స్టార్ సీనియర్ హీరోని పెట్టాలి అంటూ బుచ్చిబాబు సనా ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారట . ముందుగా చిరంజీవిని అనుకున్నారట . కానీ రామ్ చరణ్ అలా అడిగినా కూడా చిరంజీవి ఒప్పుకోలేదట . ఆయన ఏ రీజన్ తో ఈ పాత్ర ఒప్పుకోలేదో తెలియదు కానీ ఇప్పుడు జాన్వి కపూర్ స్వయంగా కాల్ చేసి అడగడంతో మెగాస్టార్ చిరంజీవి ఆ పాత్రను చేస్తాను అంటూ ఓకే చెప్పారట . డైరెక్టర్ బుచ్చిబాబు సనా అడిగిన..  అదే విధంగా కొడుకు చరణ్  అడిగిన నటించను అని చెప్పిన చిరంజీవి.. శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ అడగ్గానే ఓకే చేశారు అంటూ ప్రచారం జరుగుతుంది . బహుశా శ్రీదేవి గుర్తొచ్చినట్లుంది అందుకే కాబోలు ఆయన ఈ పాత్రను యాక్సెప్ట్ చేసినట్లున్నారు అంటూ మెగా ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు.  అంతేకాదు శ్రీదేవి - చిరంజీవి కాంబో ని గుర్తు చేసుకుంటున్నారు.



చిరంజీవి "విశ్వంభర" సినిమా షూట్లో బిజీగా ఉన్నారు . ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు చిరంజీవి . హైలెట్ ఏంటంటే దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో త్రిషతో జతకట్టాడు చిరంజీవి. అందుకే ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు మెగా అభిమానులు . పైగా ఈ సినిమాని బింబిసారా లాంటి ఒక స్పెషల్ స్టోరీ తో తెరకెక్కించిన డైరెక్టర్ వశిష్ట డైరెక్షన్ వహించడం అభిమానులకి ఇంకా హైప్స్ పెంచేసింది . చూద్దాం మరి విశ్వంభరతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చిరంజీవి..!?

మరింత సమాచారం తెలుసుకోండి: