బాలయ్య ..ఎవరినైనా సరే ఏ విషయానైనా సరే .. మొహమాటం లేకుండా అడిగేస్తూ ఉంటాడు . అది చాలామందికి తెలుసు. చాలా నాటి ప్రశ్న అయినా చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ అయినా.. చాలా ఇంపార్టెంట్ మేటర్ అయిన .. అది ఏ విషయమైనా సరే ఎదుటి వాళ్ళని చాలా హుందాగా .. ఎదుటి వాళ్ళు బాధపడకుండా అడిగేలా మనస్తత్వం కలవాడు బాలయ్య . రీసెంట్గా సోషల్ మీడియాలో బాలయ్యకు సంబంధించిన ఒక వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. అన్ స్టాపబుల్ షో తో హోస్ట్ గా మారాడు బాలయ్య .


ఇప్పటికే చాలామంది స్టార్స్ ను తనదైన స్టైల్ లో ఇంటర్వ్యూ చేశారు . మరి ముఖ్యంగా బాలయ్య హోస్టింగ్ ఆయన హేటర్స్ ని కూడా బాగా ఆకట్టుకునేలా చేస్తుంది . చాలా స్టైల్గా హుందాగా నాటీగా చిలిపి చిలిపి ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటాడు . రీసెంట్గా అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చాడు బన్నీ . పుష్ప 2  ప్రమోషన్స్ లో భాగంగానే ఆయన ఈ షోకి గెస్ట్ గా వచ్చాడు.  ఈ క్రమంలోనే పుష్ప2కి సంబంధించిన విషయాలు తో పాటు మరికొన్ని విషయాలను కూడా అడిగి తెలుసుకున్నాడు.



ఆయనకి ఎలాంటి సందర్భాలలో కోపం వస్తుంది ..? ఆయన ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నప్పుడు అల్లు అర్జున్ అమ్మగారు ఏం చేస్తారు..?  అదేవిధంగా ఆయన ఎవరి వల్ల మారాల్సి వచ్చింది..?  అలాంటి టఫ్ క్వశ్చన్స్ తో పాటు హీరోయిన్స్ లలో ఎవరు ఇష్టం ..? అంటూ చిలిపి ప్రశ్నలు కూడా వేశారు . కాగా ఇదే మూమెంట్లో బాలయ్య ని సోషల్ మీడియాలో పలువులు జనాలు  హాట్ హాట్ గా క్వశ్చన్స్ వేస్తున్నారు . ఇన్ని క్వశ్చన్స్ అడిగిన నువ్వు వైసిపి కాండిడేట్ కి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది..?  ఫ్రెండ్ అయినంత మాత్రాన ఇంటికి వెళ్లి సపోర్ట్ చేయాలా ..? మీ ఇంట్లోనే ఒక పొలిటికల్ లీడర్ ఉన్నారు కదా..?  వాళ్ళకు  మీకు మధ్య  ఏమైనా విభేదాలా..? ఇలాంటి ప్రశ్నలు అడిగి ఉంటే పుష్ప2కి..  అదే విధంగా ఆయనపై జరుగుతున్న ట్రోలింగ్కి ఎండ్ కార్డ్ పడి ఉండేది కదా సార్ అంటూ చాలా స్ట్రైట్ గా అడిగేస్తున్నారు దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: