“కల్కి 2898 AD” సినిమా బాహుబలి రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఈ బ్లాక్ బస్టర్ మూవీ కలెక్షన్స్ లో దుమ్ము రేపడమే కాకుండా చాలా సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ గ్లోబల్ రేంజ్‌కి ఎదిగాడు. ఆయన సినిమాలు చూడడానికి ప్రపంచ దేశాల ప్రజలు బాగా వెయిట్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా యంగ్ రెబల్ స్టార్‌కి ఫ్యాన్స్ పెరిగిపోవడంతో మార్కెట్ సైతం బాగా బిల్డ్ అయిపోయింది. ముఖ్యంగా జపనీయులు ప్రభాస్ సినిమాలంటే తెగ ఇష్టపడుతున్నారు.
వారి కోసమే ప్రొడ్యూసర్లు “కల్కి 2898 AD” సినిమాని జపాన్‌లో 2025, జనవరి 3న గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సిద్ధమైపోయారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. కొత్త పోస్టర్‌తో జపాన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపారు. ఈ మూవీని ఈ నెలలో రష్యన్ (డబ్బింగ్) భాషలో విడుదల చేశారు. చైనీస్ వెర్షన్ కోసం కూడా డబ్బింగ్ పనులు కొనసాగుతున్నట్లు సమాచారం. కానీ ఈ సినిమా ఇతర దేశాల కంటే జపాన్ బాక్సాఫీస్ వద్దే బాగా కలెక్షన్లను వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. జపాన్ ప్రేక్షకులలో “కల్కి 2898 AD” పై భారీ ఎత్తునే అంచనాలు నెలకొని ఉన్నాయి.
ప్రభాస్ బాహుబలి సినిమా చూశాక ఆయన్నుంచి అంత మంచి సినిమాలు మళ్ళీ వస్తాయని జపాన్ ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు. ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సినిమా సైతం జపాన్‌లో విడుదలై సూపర్ హిట్ అయింది. 2011లో వచ్చిన ఈ సినిమాను జపాన్‌లో విడుదల చేయగా దానికి ఎవరూ ఊహించని విధంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇక్కడ ప్రభాస్ కి తిరుగులేదని ఒక స్పష్టత అయితే వచ్చింది. ఇక 2017లో ‘బాహుబలి’ విడుదలై ఆ దేశంలో దాదాపు రూ.8.5 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. కల్కి ఆ రికార్డ్‌ను బ్రేక్ చేయవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.