ఎందుకంటే ఈ సినిమాలు చేసేటప్పుడు ఆయన అసలు కొంచెం కూడా జాగ్రత్త తీసుకోలేదు. కథ రెడీ అవ్వకముందే షూటింగ్ మొదలు పెట్టేసాడట. మళ్లీ మధ్యలో షూటింగ్ ఆపేయడం జరిగింది. ఇలాంటి చెత్త నిర్ణయాల వల్ల నిర్మాతలు అప్పటికే బాగా నష్టపోయారు. ప్రభాస్, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా అడవి రాముడు. బి.గోపాల్ ఈ సినిమాకి అవసరం లేకపోయినా ఎక్కువ బడ్జెట్ పెట్టించాడట. ఆయన ఈ సినిమా కోసం ఎలా అనవసర ఖర్చులు పెట్టాడో తెలియజేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుందాం.
అడవి రాముడు సినిమాలోని ఓ సాంగ్‌ను చాలా భిన్నంగా తీద్దామని బి.గోపాల్ అనుకున్నాడు. ఆ పాటలో పూలు వాడదాం అనుకున్నాడు. అందుకే షూటింగ్ సమయంలో బి.గోపాల్ తన అసిస్టెంట్ వద్దకు వెళ్లి ఏకంగా 200 మూరల మల్లెపూల మాలలు తీసుకురమ్మని చెప్పాడట. అసిస్టెంట్ వెళ్ళి నిర్మాతకి ఇదే విషయాన్ని చెప్పాడట. ఎందుకంటే ఆయనే కదా డబ్బులు ఇచ్చేది. అసిస్టెంట్ ద్వారా నిర్మాత ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యాడట. "200 మూరల మల్లెపూల మాలలా, ఏం చేసుకుంటారయ్యా!!" అని చాలా బాధగా అడిగాడట. దర్శకుడు చెప్పినట్లే చేయాలి కాబట్టి వారు డిమాండ్ చేసినట్లే 200 మూరల మల్లెపూలు తెప్పించాడు. కానీ ఈ సినిమా పాటల్లో ఎక్కడా కూడా మల్లెపూలు కనిపించవు. మరి అవి దేనికి, ఎక్కడ వాడాడో ఈ దర్శకుడికే తెలియాలి. అప్పట్లో ఈ సినిమా ఖర్చుల గురించి మూవీ ఇండస్ట్రీలో చాలా పెద్ద చర్చ కూడా జరిగింది.