త‌మిళ‌నాడు దివంగత ముఖ్య‌మంత్రి, అలనాటి అగ్ర కథానాయిక జ‌య‌ల‌లిత‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ చాలా మంది టాలీవుడ్ హీరోలతో కూడా కలిసి నటించింది. గూఢచారి 116 లాంటి సినిమాల్లో సూప‌ర్ స్టార్ కృష్ణతో కూడా జత కట్టింది. కానీ కొంతకాలం తర్వాత కృష్ణ ఆమెపై చాలా కోపం తెచ్చుకున్నాడట. అంతటితో ఆగకుండా ఆమెపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నాడట. జోక్ ఏంటంటే, ఆమె ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే కృష్ణ ఇలా మాటలు మాట్లాడటం జరిగింది. జయలలిత ఎప్పుడూ కూడా చాలా సైన్యంగా ఉంటుంది. ఎవరి జోలికి వెళ్లదు అలాంటి ఆమెపై కృష్ణ ఎందుకు కోపం తెచ్చుకున్నాడు ఆమెను ఎందుకు తిట్టాడు అనేది తెలుసుకుందాం.

1991 కాలంలో హీరో కృష్ణ తన కుమార్తె ప‌ద్మావ‌తికి జ‌య‌దేవ్‌కి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు ఎంగేజ్మెంట్ కూడా జరిపాడు. జ‌య‌దేవ్‌ పారిశ్రామిక వేత్త గ‌ల్లా రామ‌చంద్ర‌నాయుడు, గ‌ల్లా అరుణ‌కుమారిల‌కు కుమారుడు అవుతాడు. ఈ పెళ్లి వేడుకలను మ‌ద్రాస్‌లో ప్లాన్ చేశారు. ఆ పెళ్లి తంతుకు రావాలని అంద‌రికీ ఇన్విటేషన్స్ సైతం పంపించడం జరిగింది. అప్పటి త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లితకు కూడా ఆహ్వాన పత్రిక పంపించారు. ఆమెతో గతంలో సినిమాల్లో నటిస్తున్నప్పుడు కృష్ణ‌ మంచి అనుబంధం ఏర్పరచుకున్నాడు. అందుకే ఆమెను పిలిచాడు. ఈ పెళ్లికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ముఖుల‌కు కూడా ఇన్విటేషన్ సెండ్ చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయ‌కుల‌ను సైతం ఆహ్వానించారు.

అతిరథ మహారాజులందరికీ సౌకర్యాలలో ఎలాంటి లోటు రాకుండా మ‌ద్రాస్‌లో గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. పిలిచిన వారందరూ కూడా మద్రాస్ కి పోటెత్తారు. వీరిలో ఎన్టీఆర్, అక్కినేని, చిరంజీవి వంటి దిగ్గజ నటులు మాత్రమే కాకుండా ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఉన్నారు. ఏర్పాట్లన్నీ బాగానే పూర్తి చేశారు కానీ విందుకు మాత్రం త్వరగా ఏర్పాట్లు ప్రారంభించలేకపోయారు. సరిగ్గా ఆ సమయంలో జ‌య‌ల‌లిత పెళ్లి వేడుకకు వచ్చేస్తున్నారని కృష్ణ‌ చెవిలో ఒక వార్త పడింది. ఆమె కంటే త‌మిళ‌నాడు చీఫ్ సెక్ర‌ట‌రీ అక్కడికి చేరుకున్నారు.

ఆయ‌న వెంట జ‌య‌ల‌లిత సెక్యూరిటీ ఆఫీసర్ సైతం వ‌చ్చారు. అలా వస్తూనే వేదిక వ‌ద్ద ఇత‌రులు ఎవ‌రూ ఉండడానికి వీల్లేదు అంటూ కొంచెం అతిగా ప్రవర్తించారు. వ‌చ్చిన వారిని వేరే వైపు తరలించారు. హీరో కృష్ణ‌కు ఈ సంగతి తెలిసింది. ఆ అధికారి తన పెళ్లికి వస్తున్న అతిథులను ఇలా లేచి వెళ్లిపోమంటుంటే అసలు సహించలేకపోయారు. చివరికి ఆయనకు బాగా కోపం వచ్చి ఆ ఆఫీసర్‌పైనే అరిచేశారు. "సీఎం ప్రొటోకాల్ మేర‌కు ఇలా చేయక తప్పదు సార్" అని చెప్పినా సరే కృష్ణ వినలేదు. "అతిథులను ఒక్క మాట అన్నా సరే బాగోదు" అంటూ మరింత కోపానికి గురయ్యారు.

అంతేకాదు సీఎం జ‌య‌లలితకు ఫోన్ చేసి "అమ్మా, నువ్వు రావొద్దు.. వాళ్ల‌ను పంపించొద్దు" అని డైరెక్ట్ గా చెప్పేసాడట. దాంతో ఆమె షాక్ అయిందట. తర్వాత అసలు సంగతి తెలుసుకున్న ఆమె శాంతించింది. తర్వాతి రోజు  వ‌ధూవ‌రుల‌ను త‌న ఇంటికే పిలిపించుకుని బహుమతులు ఇచ్చి దీవించారట. అతిథుల మ‌ర్యాద విష‌యంలో కృష్ణ‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటారని అంటారు. ఈ సంఘటనతో అది ప్రూవ్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: