గత కొద్దిరోజులుగా కంగువ సినిమా ప్రమోషన్స్ని చిత్ర బృందం భారీగానే చేస్తోంది. ట్రైలర్ కూడా ఇటీవలే విడుదల చేయాలా భారీ స్పందన లభించిందట. ఈ సినిమా కోసం దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పాటలు కూడా బాగానే ఆకట్టుకునేలా ఉన్నాయి.. కంగువ సినిమా కథ విషయానికి వస్తే 1000 ఏళ్ల కిందట.. ఐదు తెగల మధ్య సాగేటువంటి ఒక పోరాట బ్యాక్ గ్రౌండ్ స్టోరీ తో తెరకెక్కించారట.. అలాగే ఓటమి అనేది చూడని ఒకదీరుడే కంగువ.. అలా కంగువ ఒకవైపు.. నేటితరం యువకుడిగా సూర్య మరొక పాత్రలో కనిపించబోతున్నారు. మొత్తానికి ఇందులో ద్విపాత్రాభినయంలో సూర్య నటిస్తున్నారట.. అసలు సినిమాలో కంగువ ఇచ్చిన మాట ఏమిటి..? ఆ మాటని ఎవరు తప్పి మోసం చేశారు? కంగువ ఎందుకు పునర్జన్మ ఎత్తాడు ఎవరికోసం పోరాటం చేస్తాడు అని కథాంశంతో తెరకెక్కించినట్లు ప్రచారంలో ఉన్నది.
ప్రముఖ క్రిటిక్ గా పేరు పొందిన ఉమైర్ సందు.. తన రివ్యూ ని తెలియజేస్తూ దుబాయ్ సెన్సార్ బోర్డ్ స్క్రీనింగ్ సమయంలో ఈ చిత్రాన్ని చూశాను ఈ సినిమా చాలా అద్భుతంగా ఉన్నదని తెలిపారు.. అలాగే ఈ చిత్రంలో సూర్య పర్ఫామెన్స్ ప్రశంసలు అందుకుంటారని.. మొత్తానికి మొదటి భాగం స్టోగా ఉంటుంది.. కానీ సెకండాఫ్ విధ్వంసమే క్లైమాక్స్ సూపర్ అంటూ తెలిపారు. ఈ సినిమా చూసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని తెలిపారు.. తమిళ డైరెక్టర్ కన్నా ఒక గొప్ప కలని నిజం చేసుకున్నారంటూ తెలిపారు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలని బాక్సాఫీస్ వద్ద హిట్ చేయాలని తెలిపారు. బాబీ డియోల్ నటన దిశాపటని రొమాన్స్ సన్నివేశాలలో అదరగొట్టింది అంటూ తెలిపారు.