టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పొడుగు కాళ్ల సుందరి అతి తక్కువ కాలంలోనే టాప్ మోస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ మధ్య పెద్దగా ఛాన్సులు రానప్పటికీ.... ఈ బ్యూటీ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోలు అందరి సరసన సినిమాలు చేసి.... మంచి పేరు తెచ్చుకుంది. ఈ బ్యూటీ ది మహారాష్ట్ర అన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన పూజా హెగ్డే.. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.


బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోయిన్లు మన తెలుగులోకి వస్తారు. అక్కడ సక్సెస్ కాకపోయినా ఇక్కడ సక్సెస్ అయి... మళ్లీ బాలీవుడ్కు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి కోవలోకే పూజా హెగ్డే కూడా వస్తుంది.  అలాంటి బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పూజ హెగ్డే... 2010లో మిస్ ఇండియా పోటీలో రెండవ స్థానాన్ని సంపాదించుకొని పాపులర్ అయింది. తన సినిమా కెరీర్ తమిళ్ ఇండస్ట్రీలోనే ప్రారంభించి ఆ తర్వాత తెలుగులోకి వచ్చింది.

 
అక్కినేని నాగచైతన్య హీరోగా చేసిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగులోకి వచ్చి....  తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా 2014లో వచ్చింది.  సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈ బ్యూటీ కి మాత్రం వరుసగా ఆఫర్లు రావడం మొదలయింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా ముకుంద సినిమాలో సంప్రదాయ హీరోయిన్గా కట్టుబొట్టుతో కనిపించింది. దీంతో పూజ హెగ్డే అందాలకు అందరూ ఆరిపోయారు.


సినిమా పర్వాలేదనిపించింది. ఆ తర్వాత అల్లు అర్జున్తో దువ్వాడ జగన్నాథ్ సినిమా తీసింది పూజ హెగ్డే. ఈ సినిమాలో అందాలు ఆరబోసి ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా బంపర్ హిట్ కావడంతో ఇండస్ట్రీలో ఆమెకు తిరుగులేకుండా పోయింది.రంగస్థలంలో ఐటెం సాంగ్, గద్దల కొండ గణేష్ ,  రాధా శ్యామ్, అలా వైకుంఠపురం లో లాంటి సినిమాలు చేసి... మంచి సక్సెస్ అందుకుంది పూజ హెగ్డే. అయితే గుంటూరు కారంలో మొదట సెలెక్ట్ ఆ తర్వాత రిజెక్ట్ అయిపోయిందట. ఆ తర్వాత ఈ బ్యూటీ కి తెలుగులో అవకాశాలు రావడం లేదు. ఇలా బాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ లో.. కొన్ని రోజులు మెరిసి... ఇప్పుడు డీలా పడిపోయింది పూజా హెగ్డే.

మరింత సమాచారం తెలుసుకోండి: