పవన్ కళ్యాణ్ - సుజిత్ కాంబినేషన్ తయారవుతున్న ఓజి సినిమాకు చాలా క్రేజీ ఉంది .. ఇది వాస్తవం. ఎందుకంటే ? పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. ప్ర‌భుత్వంలో ఉప ముఖ్య‌మంత్రి గా ఉన్న హీరో సినిమా వ‌స్తోంది అంటే ప్రేక్ష‌కుల్లో ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఎన్టీఆర్ దేవర హిట్ తర్వాత ఓజి నిర్మాత దానయ్య ఈ సినిమా బిజినెస్ కు భారీ రేట్లు కోట్ చేస్తూ వస్తున్నారు. రు. 70 కోట్ల రేంజ్ లో ఆంధ్ర రేటు చెప్పారు .. అదికూడా సిడెడ్‌ కాకుండా .. అయితే చివరికి జీఎస్టీతో కలుపుకుని రు. 65 కోట్ల కు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. దీనికి కూడా సినిమా వ్యాపారంలో ఉన్న బయర్లు రెడీ అంటున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే జనసేన లీడర్లు ఏరియాల‌ వారీగా హక్కులు తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు.


వైజాగ్ - ఈస్ట్ - నెల్లూరు ఇలా ప్రతి చోట లోకల్ బయ్యర్లను పక్కనపెట్టి జనసేన లీడర్ ముందుకు వచ్చి తమకే సినిమా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పైగా ఒక్కో ఏరియాకు ముగ్గురు నలుగురు పోటీ పడుతున్నారు. ఈస్ట్ గోదావరి హక్కులు తనకు తప్ప మరెవ్వరికీ ఇవ్వకూడదని ఎంపీ టీ టైమ్ అధినేత తంగేళ్ల ఉదయ్‌ శ్రీనివాస్ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇక విశాఖ తనకే కావాలని ఓ జనసేన కీలక నేత పట్టుబడుతున్నారట. ఇవన్నీ చూసి రెగ్యులర్గా సినిమా వ్యాపారంలో ఉన్న జనాలు గోల గోల చేస్తున్న పరిస్థితి. ఇదేంటి ఈ పోటీ అని వాపోతున్నారట. ప్రస్తుతానికైతే ఇంకా ఏ ఏరియాకి ఎవరికి హక్కులు ఖరారు చేయలేదు. సినిమాను మార్చిలో విడుదల చేస్తారని హరిహర వీరమల్లు మేలో ఉంటుందని టాక్. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఇప్పుడు జనసేన నుంచి ఏ స్థాయిలో పోటీ ఉందో చెప్పేందుకు ఇది నిదర్శనం అని చెప్పాలి. ఇక ఈ రెండు సినిమాలను ఓ కొలిక్కి తీసుకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలో నటిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

OG