ఇది నిజంగా సమంత ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజింగ్ న్యూస్ అని చెప్పాలి.  ఇప్పటివరకు సమంతని సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్ చేశారు జనాలు . మరీ ముఖ్యంగా ఏం మాయ చేసావే సినిమా మూమెంట్లో ఆమెను ఏ రేంజ్ లో పొగిడేశారో.. ఇప్పుడు నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసిన తర్వాత ఆమె నటించిన సినిమాలు అదే విధంగా తాజాగా నటించిన సిటాడిల్ వెబ్ సిరీస్ చూసి అంతకంటే దారుణంగా ట్రోల్ చేశారు . కాగా రీసెంట్గా సమంత ఒక తెలుగు హీరో సినిమాకి సైతం కమిట్ అయింది అంటూ వార్తలు వినిపించాయి .


కానీ ఇప్పుడు సమంత తీసుకున్న నిర్ణయం మాత్రం తన పేరు మళ్లీ సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయే విధంగా ఉండబోతుంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.  సినిమా ఇండస్ట్రీలో తెరపై కొన్ని కొన్ని జంటలు చాలా చాలా బాగా పాపులారిటీ సంపాదించుకుంటాయి . గతంలో చిరంజీవి - సౌందర్య ..ఎన్టీఆర్ - శ్రీదేవి ..జూనియర్ ఎన్టీఆర్ - గజాల ఇలా చాలామంది మంచి మంచి కామెంట్స్ దక్కించుకున్నారు. వాళ్లలో ఒకరే సమంత - విజయ్ దళపతి కూడా . ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తెరపై వీళ్లు కనిపిస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టే . వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు జనాలను బాగా ఆకట్టుకున్నాయి.



కాగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళ కాంబోలో సినిమా రాబోతున్నట్లు కోలివుడ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ వీళ్లు జత కట్టబోతున్నారట . విజయ్ తన 69వ చిత్రంలో సమంతకు ఛాన్స్ ఇచ్చాడట . ఆల్రెడీ ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది . ఇప్పుడు ఈ సినిమాలో సమంత కూడా ఓ పాత్ర కోసం తీసుకున్నారట మేకర్స్ . ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ కోలీవుడ్ మీడియాలో మాత్రం బాగా ఈ వార్త ట్రెండ్ అవుతుంది . తెలుగులో రాంచరణ్ తో రంగస్థలం 2 సినిమాకి ఓకే చేసింది అంటూ ప్రచారం జరుగుతుంది . అదేవిధంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ దళపతితో జతకట్టబోతున్నట్లు ఓ వార్త వినిపిస్తుంది . ఈ రెండు సినిమాలు హిట్ అయితే మాత్రం ఇక సమంత బ్యాక్ స్టెప్ వేయాల్సిన పని ఉండదు. కచ్చితంగా రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయి. తద్వారా ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: