మరో కొలీవుడ్ స్టార్ హీరో సింబు - నయనతార కలిసి నటించినప్పుడే వీరీ మధ్య ప్రేమ పుట్టింది .. అప్పట్లో వీరిద్దరూ జంటగా కలిసి ఫంక్షన్ లో కూడా కనిపించారు.సింబు, ఆమెనే పెళ్లి చేసుకుంటారని అనుకుంటున్నా సమయంలో .. వీరిద్దరి వ్యక్తిగత ఫోటోలు లీగ్ అవడంతో వీరు విడిపోయారు. సింబు తర్వాత డాన్స్ మాస్టర్ నటుడు ప్రభుదేవా తో నయనతార ప్రేమలో పడ్డారు .. ఆయన కోసం సినిమాలకు కూడా దూరం అవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారు . అంతేకాకుండా మతం కూడా మార్చుకున్నారు. వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది .. ప్రభుదేవా తో విడిపోయాక విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . సింబు, నయనతారతో విడిపోయాక మరో హీరోయిన్ హన్సికతో ప్రేమలో పడ్డాడు.. అలా కలిసి సినిమాలో చేస్తున్న సమయంలోనే వీరు డేటింగ్ కూడా చేస్తున్నారని వార్తలు కూడా వచ్చేయి.. కానీ ఒక సంవత్సరంలోనే వారి ప్రేమ ముగిసిపోయింది. సింబుతో విడిపోయిన తర్వాత హన్సిక సోహైల్ కతూరియాను పెళ్లి చేసుకుంది.
సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ 19 ఏళ్ల వయసులోనే మరో గాయని ఆండ్రియా తో ప్రేమలో పడ్డారు.. వీరిద్దరూ బెడ్ రూమ్‌లో సన్నిహితంగా ముద్దు పెట్టుకున్న ఫోటోలు లీక్ అయ్యాక వీరు విడిపోయారు. కానీ వీరు విడిపోవడానికి తన కంటే ఆండ్రియా వయసులో పెద్దది అనే కారణాలు కూడా అనిరుద్ చెప్పారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, హీరో సిద్ధార్థ్ కూడా ప్రేమించుకున్నారు పెళ్లి కోసం వారు ఆలయాల్లో పూజలు కూడా చేశారు. కానీ ఆ తర్వాత అన్యుహంగా మనస్పర్ధలు కారణంగా విడిపోయారు. తెలుగు హీరోయిన్ అంజలి జర్నీ సినిమాలో కలిసి నటించిన హీరో జైతో ప్రేమలో పడ్డారు. కానీ ఆకస్మికంగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు. నటుడు విశాల్, నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. శరత్ కుమార్‌తో విశాల్‌కు వచ్చిన మనస్పర్థల కారణంగా, తన తండ్రి కోసం వరలక్ష్మి తన ప్రేమను వదులుకున్నారు. దీని తర్వాత ఇటీవలే నికోలాయ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వరలక్ష్మి.