రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని సినిమా చూస్తూ కూర్చోబెట్టడం అంటే అంత ఈజీ కాదు.. ఆ సినిమా షూటింగ్లో ఏదైనా సీన్ కోసం నటీనటులు దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడతారు. నిప్పులు కక్కే ఎండలో, గెడ్డ కట్టే మంచు లోను ఎలాంటి ఆటంకాలు రాకుండా సినిమా షూటింగ్ చేయాల్సిందే.. అలాగే ఏదైనా డిఫరెంట్ స్టైల్లో మేకప్ కోసం గంటలకు గంటలు  సహనంతో అలా కూర్చోవాల్సిందే. ఇంకొన్నిసార్లు కంపుకొట్టే ఏరియాలో కూడా తిరుగుతూ షూటింగ్ కోసం అక్కడ ఉండాలి. అలా అంత కష్టపడినా కొన్నిసార్లు ఆ నటీనటులు చేసే సీన్ కరెక్ట్ గా రావడానికి టేకుల మీద టెక్లు తీసుకోవాల్సి ఉంటుంది. అది ఓ ముద్దు సన్నివేశం అయితే.. అలాంటిదే ఓ బాలీవుడ్ సినిమాలో లాంగ్ కిస్ సీన్ కోసం హీరో హీరోయిన్లు ఏకంగా మూడు రోజులు దానికోసం కష్టపడాల్సి వచ్చిందట.. అసలు మేటర్ లోకి వెళితే..


బాలీవుడ్ ఒకప్పటి స్టార్ దర్శకుడు ధర్మేష్ దర్శన్.. హిందీలో  లూటేరాతో అనే సినిమాలో ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత ఆయన రాజా హిందూస్థానీ, మేలా, ధడ్కన్, హాన్ మేన్ భీ ప్యార్ కియా, బేవాఫా, ఆప్ కి ఖటిర్ వంటి సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తన 3 దశాబ్దాల కెరియర్లో కేవలం ఏడు సినిమాలు మాత్రమే ఆయన తెరకెక్కించాడు.. ఆయన తీసే సినిమాల్లో తను అనుకున్న సీన్ వచ్చేవరకు ఎంతో కష్టపడతారని పేరు కూడా ఉంది. ఆ క్రమంలోనే రాజా హిందుస్తానీ సినిమా సమయంలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది.  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కరీష్మా కపూర్‌లు రాజా హిందుస్తానీ మూవీలో జంట‌గా నటించారు. సురేష్ ఒబెరాయ్, అర్చనా పూరన్ సింగ్, జానీ లీవర్, ఫరీదా జలాల్, టికూ తలసానియాలు వంటి వారు మిగిలిన పాత్రలో కనిపిస్తారు. అయితే 1965లో శశికపూర్ నంద్యాల నటించిన జబ్ జబ్ పూల్ ఖిలే సినిమా ఆధారంగా  రాజా హిందుస్తానీ మళ్ళీ రీమేక్ చేసి తెరకెక్కించారు.


అయితే ఈ సినిమాలో కరిష్మా కపూర్ నటించిన పాత్రకు ముందుగా జూహీ చావ్లాను అనుకున్నారు ఆమె నో చెప్పడంతో.. ఆ తర్వాత పూజా భట్, ఐశ్వర్యరాయ్‌‌లను కూడా హీరోయిన్గా నో చెప్పారు. చివరకు కరిష్మా కపూర్  ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐదు కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన రాజా హిందుస్తానీ 1996 నవంబర్ 17న ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్గా నిలిచింది. ఆ రోజుల్లోనే ఈ సినిమా 70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాలీవుడ్ వర్గాలను సైతం ఆశ్చర్యం కలిగించింది. 90వ దశంలో బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన  సినిమాల్లో ఒకటిగా రాజా హిందుస్తాన్ నిలిచింది ఈ ఏడాదితో ఈ మూవీ రిలీజై 28 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా చిత్ర దర్శకుడు ధర్మేష్ దర్శన్ ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. రాజా హిందుస్తానీలో ఓ ముద్దు సీన్‌ని చిత్రీకరించాల్సి వచ్చిందని.. ఈ విషయాన్ని ముందుగానే కరిష్మాకు చెప్పామని, ఆమెకు అదే తొలి ఫస్ట్ లిప్ లాక్ కావడంతో కంగారు పడిందని దర్శన్ తెలిపారు. దీంతో కరిష్మ తల్లిని సెట్‌కి పిలిపించామని.. కానీ సీన్ సరిగా రాకపోవడంతో ఏకంగా 47 టేకులు తీసుకుని, 3 రోజుల పాటు షూటింగ్ చేశామని ధర్మేష్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: