మెగాస్టార్ చిరంజీవి అంటే సహాయానికి మరో మారుపేరు అని ఇండస్ట్రీలో అందరూ భావిస్తూ ఉంటారు . ఆయన చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి హెల్ప్ చేస్తూ తనదైన స్టార్ స్టేటస్ తో ముందుకు దూసుకెళ్లిపోతూ ఉంటాడు . కాగా రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఉండే ఒక యంగ్ నటుడు సహాయం అడిగితే అస్సలు చేయలేదట . దానికి కారణం ఆయనకు ఉన్న పాడు అలవాట్లే .


ఆయన తండ్రి ఒక మంచి నటుడు . తండ్రి పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆ తర్వాత ఆయన కూడా ఇండస్ట్రీలో మంచి నటుడుగా ఎన్నో సినిమాల్లో నటించి స్పెషల్  గుర్తింపు సంపాదించుకున్నాడు.  అయితే చెడుసావాసాలు చేసి చెడు వ్యసనాలకు బాగా బానిసైపోయి సినిమా ఇండస్ట్రిలో అవకాశాలు వస్తున్న సరే అవకాశాలను మిస్ చేసుకున్నాడు ఈ నటుడు.  ఇప్పుడు ఫైనాన్షియల్ గా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . చాలా చాలా కష్టాలల్లో ఉన్నారట.



ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే జాలి హృదయం గల చిరంజీవిని సహాయం కోరగా ఆయన నిర్మొహమాటంగా హెల్ప్ చేయను అంటూ చెప్పేశారట . సహాయం చేస్తే దాన్ని ఉపయోగించుకునే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ..చెడు పనులకు..చెడ్డ అలావాట్లకు బానిస అయిన వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అంటూ తేల్చి చెప్పేసాడట. దీంతో మెగాస్టార్ చిరంజీవి చేసిన పనికి అందరూ శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.  సహాయం చేయడమే కాదు అది కరెక్ట్ వాళ్ళకి సహాయం చేయడమే ఇంపార్టెంట్ అంటూ చిరంజీవిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. గతంలో ఈ నటుడికి వేరే వాళ్లు కూడా సహాయం చేశారు. కనైఇ దాని యూస్ చేసుకోలేక పోయాడు. ఇప్పుడు మళ్లీ హెల్ప్ కోసం చీరంజీవి ఇంటికే వచ్చాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: