ఈయన ఇష్టమనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పట్లో చాలా మంది కొత్త ఆర్టిస్ట్ లని రామోజీరావు గారు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలానే చరణ్ రెడ్డి కూడా ఇష్టమనే సినిమా లో అవకాశం వచ్చింది . అయితే తొలి సినిమా అంతగా ఆడకపోవటంతో ఆ సినిమా తర్వాత ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ సుప్రియ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయ్యాక సుప్రియ చరణ్ రెడ్డి ఇద్దరు కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికి ఆ తర్వాత చరణ్ రెడ్డికి సినిమా అవకాశాలు లేక సుప్రియ కూడా ఖాళీగా ఉండటంతో ప్రతిసారి ఇద్దరి మధ్య గొడవలు వచ్చేవట. ఆ గొడవల్లో విసిగిపోయిన చరణ్ రెడ్డి మద్యపానానికి బానిస అయ్యారట. ఇక భర్త తాగి రావటం చూసి గొడవ పడటం మొదలుపెట్టేదట. ఇక దీంతో ఇద్దరి మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి..
దాంతో సుప్రియ తన తాత నాగేశ్వరరావు ఇంటికి వచ్చేసిందట ఆ తర్వాత సుప్రయ తన భర్త చరణ్ రెడ్డికి విడాకులు ఇచ్చేసి ఒంటరిగా ఉంది. ఇక వైపు సినిమాల్లో అవకాశాలు రాక మరోవైపు కట్టుకున్న భార్య కూడా దూరం అవటంతో చరణ్ రెడ్డి తీవ్రమైన మనస్థాపానికి లోనై మరింత మద్యపానానికి బానిస అయ్యాడట. ఇక దాంతో అవయవాలు చెడిపొయి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయాడని ఇండస్ట్రీలో టాక్ నడిచింది. అయితె ఇక్కడ చాలా మందికి తెలియని మరో విషయం ఏమిటంటే చరణ్ రెడ్డి చనిపోయే వరకు కూడా సుప్రియ భర్త అనే విషయం ఎవరికీ తెలియదు.. ఇక సుప్రియ భర్త చరణ్ రెడ్డికి శ్రీయ కి మధ్య ఉన్న రహస్య సంబంధం ఏంటి అంటే చరణ్ రెడ్డి శ్రియ కాంబినేషన్లో ఇష్టం అనే సినిమా వచ్చింది. ఈ సినిమాతో చరణ్ రెడ్డి శ్రీయ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినప్పటికి శ్రీయ హీరోయిన్గా స్టార్ స్టేటస్ కి వెళ్లి ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటే చరణ్ రెడ్డి మాత్రం ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు.