స్టార్ హీరోయిన్ సాయిపల్లవి అమరన్ సినిమాలో తల్లి రోల్ లో నటించి ఆకట్టుకున్నారు. హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ సైతం తలి రోల్ లో నటించి మెప్పించారు. 35 చిన్న కథ కాదు సినిమాలో నివేదా థామస్ తల్లి రోల్ లో నటించి ఆకట్టుకున్నారు. జెర్సీ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ సైతం తల్లి పాత్రలో నటించి ఆ రోల్ కు ప్రాణం పోశారు. శబరి మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ తల్లి రోల్ లో నటించడం జరిగింది.
క్రాక్ సినిమాలో శృతి హాసన్ సైతం తల్లి రోల్ లో నటించారు. జవాన్ సినిమాలో దీపికా పదుకొణే, నయనతార తల్లి పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. భీమ్లా నాయక్ మూవీలో నిత్యామీనన్ తల్లి రోల్ లో నటించారు. సంయుక్తా మీనన్ సైతం అదే సినిమాలో తల్లి పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు మాత్రం ఈ తరహా పాత్రలలో నటించడానికి వెనుకడుగు వేస్తుండటం గమనార్హం.
తల్లి పాత్రల్లో నటించడం సులువైన విషయం కాకపోయినా ఈ హీరోయిన్లు మాత్రం అంచనాలను మించి మెప్పిస్తున్నారు. టాలీవుడ్ హీరోయిన్లకు క్రేజ్ సైతం ఊహించని స్థాయిలో పెరుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. టాలీవుడ్ హీరోయిన్లను అభిమానించే ఇతర భాషల ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.