సాయిపల్లవి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో  భారీ ఫేమ్ సంపాదించిన హీరోయిన్. అలాంటి ఈ ముద్దుగుమ్మ  సినిమాల ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.. ఫిదా మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ  మొదటి చిత్రంతోనే అద్భుతమైన హిట్ అందుకుని తనకు ఎదురులేదు అనిపించుకుంది. అయితే ఫిదా మూవీ లో వరుణ్ తేజ్ కంటే ఎక్కువ సాయి పల్లవి  గుర్తింపు తెచ్చుకుంది.. ఈ మూవీ అనంతరం లవ్ స్టోరీ, ఎంసీఏ వంటి చిత్రాల్లో చేసి  మళ్లీ విజయం సాధించింది.. అలాంటి ఈమె నానితో వరుసగా శ్యామ్ సింగరాయ్, ఎంసీఏ వంటి చిత్రాల్లో చేసి భారీ హిట్ అందుకుంది. శ్యాం సింగరాయ్ చిత్రం లో సాయి పల్లవి దేవదాసి రోల్ చేయడం అందరికీ తెలిసిందే. 

సినిమా షూటింగ్ సమయంలో సాయిపల్లవి అనేక ఇబ్బందులు పడిందట.. రాత్రింబవళ్లు షూటింగ్లోనే  ఉంటూ అనేక నిద్రలేని రాత్రులు గడిపిందట..ఈ మూవీ షూట్ సమయంలో తెల్లారే వరకు షూటింగ్ జరిగేదట.. పగలు రాత్రి లేకుండా ఆమె షూటింగులో పాల్గొని నిద్రలేకుండా అనేక ఇబ్బందులు పడిందట.. మానసిక ఒత్తిడికి గురైన ఈ ముద్దుగుమ్మ  చివరికి తన బాధను తన చెల్లి పూజాఖన్నాకు చెప్పుకొని కన్నీరు పెట్టిందని తెలుస్తోంది.  ఒక్కరోజైనా సెలవు దొరికితే చాలు విశ్రాంతి తీసుకుంటానని సాయిపల్లవి సిస్టర్ తో చెప్పుకుంటూ కన్నీరు కార్చిందట.

 ఆమె బాధ విన్నటువంటి పూజా కన్నా వెంటనే శ్యామ్ సింగరాయ్ మూవీ నిర్మాత వెంకట్ బోయినపల్లికి కలిసి చెప్పింది.  ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న వెంకట్ బోయినపల్లి 10 రోజులపాటు నీకు ఇష్టం వచ్చినట్లు విశ్రాంతి తీసుకో, ఆ తర్వాత షూటింగ్ కి రా అని ఆమె సెలవులు అందించారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా సాయిపల్లవి అమరన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: