మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతోమంది నటీనటులకు అండగా నిలిచాడు. నాలుగు దశాబ్దాల నుంచి సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. రీసెంట్ గా చిరంజీవి "బోలాశంకర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.



ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ తో "విశ్వంభర" సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాగా, మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీకి హీరోలుగా ఎంతోమంది ఎంట్రీ ఇచ్చారు. కానీ హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వడానికి మెగా కుటుంబం నుంచి ఆసక్తిని చూపించలేదు. నాగబాబు కుమార్తె నిహారిక మాత్రం మొదట యాంకర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోయిన్గా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ నిహారిక చేసిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ కాలేదు.



అనంతరం నిహారిక నిర్మాతగా స్థిరపడింది. ఇక చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా ఒక సినిమాలో హీరోయిన్గా నటించింది. కానీ ఈ విషయం ఎవరికీ పెద్దగా తెలియదు. సుస్మితను హీరోయిన్గా పరిచయం చేయాలనుకున్న ప్రతిసారి చిరంజీవికి ఏదో ఒక ఆటంకం ఎదురు వచ్చిందట. దీంతో సుస్మితను హీరోయిన్గా పరిచయం చేయాలనుకున్న చిరంజీవి తన కోరికను తీర్చుకోలేకపోయాడు.



సుస్మిత హీరోయిన్గా కేవలం ఒకే సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో సినిమాను మధ్యలోనే ఆపేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ వచ్చింది. ఇందులో సుస్మిత, ఉదయ్ కిరణ్ జంటగా ఓ సినిమాలో నటించడం జరిగింది.  ఫస్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా సెకండ్ హాఫ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే సుస్మిత మంచి హీరోయిన్గా ఇండస్ట్రీలో రాణించేది కావచ్చని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: