యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పత్రి నాయకుడి పాత్రలో నటించగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను కాబట్టి మంచి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ కథా రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ దేవర సినిమా గురించి మాట్లాడుతూ ... ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ ఎలా ఉంటుందా అనే అంచనాలు నాలో భారీగా పెరిగిపోయాయి. ఇక కొరటాల శివ తో సినిమా అనగానే జనాలు ఆయన పూర్వపు సినిమాలను దృష్టిలో పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆయన గత సినిమా కాస్త ప్రేక్షకులను నిరాశ పరిచింది. దాని వల్ల దేవర సినిమాను అంచనా వేయలేము. ఎందుకు అంటే మా సినిమాలు కూడా అద్భుతమైన విజయాలు అందుకున్నవి ఉన్నాయి. ఘోరమైన పరాజయాలు సాధించినవి కూడా ఉన్నాయి. సినిమా పరాజయానికి అనేక కారణాలు ఉంటాయి.

దాని వల్ల టెక్నీషియన్స్ తప్పు పట్టలేము. ఇకపోతే ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో దేవర పాత్రను పూర్తిగా చూపించేశారు. అలా కాకుండా కొంత భాగం దేవర ఫ్లాష్ బ్యాక్ ను చూపించి ఆ తర్వాత వర పాత్రను , జాన్వితో సన్నివేశాలను , కామెడీ ట్రాక్ లను కొంత భాగం దేవర ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను చూపించుకుంటే ఈ సినిమా 1000 కోట్ల వసూళ్లను సాధించేది అని నేను అనుకుంటున్నాను అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: