దీపావళికి విడుదలైన ‘అమరన్’ 300 కోట్ల కలక్షన్స్ మార్క్ ను దాటిపోవడం చూసిన ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఈమూవీకి ఒక టాప్ హీరో సినిమాకు వచ్చిన విధంగా కలక్షన్స్ వస్తూ ఉండటంతో ఈమూవీని తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడ ధియేటర్లలో రెగ్యులర్ షోస్ తో కంటిన్యూ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయం సూర్య ‘కంగువ’ కు శాపంగా మారే ఆస్కారం ఉంది అంటూ కాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి.



తమిళనాడులోని ధియేటర్ల యజమానులు హిట్ టాక్ వచ్చిన సినిమాను మూడవ వారం కొనసాగించాలి అంటే ధియేటర్స్ కు వచ్చిన కలక్షన్స్ లో 60 శాతం తమ రెంట్ గా తీసుకుంటారట. ‘అమరన్’ కలక్షన్స్ చాల బాగుండటంతో తమిళనాడులో అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో ఈమూవీ చాలచోట్ల కొనసాగే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనితో ఈవారం విడుదలకాబోతున్న సూర్య ‘కంగువ’ కు ఆశించిన స్థాయిలో ధియేటర్లు దొరకక పోవడంతో ఈమూవీని కొనుకున్న బయ్యర్లు బాగా టెన్షన్ పడుతున్నట్లు టాక్.



సూర్య కెరియర్ లో ఏసీనిమా పైనా ఖర్చు పెట్టని విధంగా ‘కంగువ’ పై భారీ బడ్జెట్ పెట్టారు. దీనికితోడు ఈసినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాలు ఈసినిమానే ప్రపంచంగా తన జీవితాన్ని కొనసాగించాడు. గత రెండు వారాలుగా దేశవ్యాప్తంగా ఒక్క క్షణం తీరిక లేకుండా టూర్ చేస్తూ ఈమూవీని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ఈసినిమాలోని పాటలు ట్రైలర్ చాలామందికి అంతంత మాత్రంగా అనిపించడంతో ఈమూవీ నిర్మాతలతో పాటు సూర్య కూడ తెగ టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.



తమిళ ‘బాహుబలి’ గా తమిళ సినిమా రంగం ఈమూవీ పై చాల అంచనాలు పెట్టుకుంది. అయితే దేవిశ్రీ ప్రసాద్ ఈమూవీకి అందించిన ట్యూన్స్ అంతంత మాత్రంగా నేటితరం ప్రేక్షకులు ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ క్రేజ్ తగ్గిపోతున్న పరిస్థితులలో ఈమూవీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సెట్ చేశారు అన్న ఆశక్తి చాలమందిలో ఉంది..  








మరింత సమాచారం తెలుసుకోండి: