ఈ సాంగ్ కోసం వారం రోజుల సమయాన్ని కేటాయించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. కాగా, గతంలో పుష్ప సినిమా విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక మందన్న హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంది. అందుకే పుష్ప-2లో కూడా రష్మిక మందన్నని హీరోయిన్గా పెట్టారు.
కాగా, పుష్ప 2 సినిమాలో రష్మిక, బన్నీ మధ్య కాస్త రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయట. వీరిద్దరి రొమాన్స్ చాలా అద్భుతంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ తరుణంలోనే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గతంలోనే రష్మికకు వార్నింగ్ ఇచ్చిందట. తన భర్తతో ఎక్కువగా క్లోజ్ గా ఉండదని ఫోన్ చేసి చెప్పిందట.
రొమాంటిక్ సన్నివేశాలలో అసలు నటించకూడదని అంటూ రష్మికకు స్నేహ రెడ్డి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మరి పుష్ప 2లో కాస్త రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్నేహ రెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలని కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వార్తలో ఏ మేరకు వాస్తవం ఉందో చూడాల్సిందే. కాగా.. సోషల్ మీడియాలో స్నేహ రెడ్డి చాలా యాక్టివ్ గా ఉంటుదన్న సంగతి తెలిసిందే. నిత్యం ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది.