టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. క్రియేటివ్ డైరెక్టర్  గా సుకుమార్ మంచి గుర్తింపు సంపాదించాడు.. అల్లు అర్జున్ తో తెరకెక్కించిన ‘ఆర్య’ సినిమాతో సుకుమార్ సినీ ప్రస్థానం మొదలైంది.. ఆ సినిమా అప్పటి యూత్ కి బాగా కనెక్ట్ అయింది.. వన్ సైడ్ లవర్ కి వుండే బెన్ఫిట్స్ గురించి సుకుమార్ చెప్పిన స్టైల్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేసింది.. దీనితో ఆర్య సినిమా ఇటు సుకుమార్ కెరీర్ లో అటు అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఈ సినిమా తరువాత సుకుమార్ టాప్ డైరెక్టర్ గా మారారు వరుసగా ఎన్టీఆర్, మహేష్, రాంచరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించి సూపర్ హిట్స్ అందుకున్నాడు.. లవ్ స్టోరీస్ ని సరికొత్తగా చూపించే సుకుమార్ లైఫ్ లో అంతకు మించి ప్రత్యేకమైన లవ్ స్టోరీ వుంది..తన భార్య హంసినీ తో లవ్ జర్నీ ఎలా మొదలు అయిందనే విషయం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ తెలిపారు..


సుకుమార్ మాట్లాడుతూ "మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌. అది కూడా విచిత్రంగా సినిమా హాల్లోనే జరిగింది.నా మొదటి సినిమా ఆర్య రిలీజ్ సమయంలో సుదర్శన్ థియేటర్ కి వెళ్లాను అక్కడ ఓ అమ్మాయి వచ్చి ఆటోగ్రాఫ్ అడిగింది..తొలి చూపులోనే ఆ అమ్మాయి నచ్చి నేను నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినట్లు సుకుమార్ తెలిపారు.. అయితే తన అమాయకత్వానికి ఒక్కోసారి నా ఈగో హర్ట్ అయేది..షూటింగ్ సమయంలో టెక్నీషియన్స్ అందరూ పని చేస్తుంటే, డైరెక్టర్ అసలేం చేస్తాడు అని అడిగింది... కెమెరామన్‌ సినిమా తీస్తాడు. ఆర్టిస్ట్ లు యాక్ట్‌ చేస్తారు. ప్రొడ్యూసర్‌ డబ్బులు పెడతారు.మరి నువ్వేం చేస్తావ్‌ అని అడిగింది..అలా కాదు.. నేను బన్నీకి ఎలా చేయాలో చెబుతాను అంటే...బన్నీకి నువ్వు చెప్పేదేముంది..బన్నీ యాక్టర్‌... అతనే చేస్తాడు కదా అనేసేది.. నా సినిమాల గురించి ఇప్పటికీ తనేం పెద్దగా పట్టించుకోదు అని సుకుమార్ తెలిపారు..దర్శకుడు ఎంత కష్టపడడతాడో తనకి డిటైల్డ్ గా వివరించాను.. అలా మా మధ్య ప్రేమ మొదలయింది అని సుకుమార్ తెలిపారు..మా ప్రేమకు పెద్ద వాళ్ళు ఒప్పుకోలేదు..దాదాపు ఐదు సంవత్సరాలకు పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు సుకుమార్ తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: