స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. పూరీ జగన్నాథ్ తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు తన డైలాగ్స్ తో ఫ్యాన్స్ కు అంతకంతకూ దగ్గరయ్యారు. పూరీ జగన్నాథ్ భార్య పేరు లావణ్య అనే సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ లావణ్య ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్లిద్దరి లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు ఉన్నాయి.
వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా పూరీ జగన్నాథ్ లవ్ స్టోరీ ఆయన సినిమాల్లోని లవ్ స్టోరీని మించి ఉందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. డైరెక్టర్ కావాలని భావించిన పూరీ జగన్నాథ్ కెరీర్ తొలినాళ్లలో కొన్ని సినిమాలకు ఘోస్ట్ డైరెక్టర్ గా పని చేసేవారు. అలా ఒక మూవీ షూట్ జరుగుతున్న తరుణంలొ ఆ మూవీ షూట్ చూడటానికి లావణ్య వచ్చారు. అకస్మాత్తుగా ఆమెను చూసిన పూరీ జగన్నాథ్ ఆమెపై మనసు పారేసుకున్నారట.
ఆమెకు తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని పూరీ జగన్నాథ్ చెప్పగా మొదట కార్డ్ తీసుకోని లావణ్య ఆ తర్వాత కార్డ్ తీసుకుని ఫోన్ లో మాట్లాడింది. అలా మాటలతో మొదలైన పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారింది. పూరీ జగన్నాథ్ లావణ్య మధ్య విబేధాలు అంటూ కొన్ని వార్తలు వినిపించినా పూరీ జగన్నాథ్ లావణ్య సన్నిహితులు మాత్రం ఈ కామెంట్లను నమ్మడం లేదు.
పూరీ జగన్నాథ్ లావణ్య కొన్ని కారణాల వల్ల లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. తన దగ్గర ఏమీ లేని రోజుల్లోనే లావణ్య నన్ను నమ్మి పెళ్లి చేసుకుందని పూరీ జగన్నాథ్ తెలిపారు. పూరీ జగన్నాథ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. పూరీ జగన్నాథ్ లాంటి భర్త దొరకడం లావణ్య అదృష్టమని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.