కోలీవుడ్ స్టార్ హీరో తళపతి విజయ్ కొన్ని సంవత్సరాల క్రితం తుపాకీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... ఏ ఆర్ మురగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు. తెలుగు లో ఈ సినిమా ద్వారానే విజయ్ కి మొట్ట మొదటి విజయం దక్కింది. ఇకపోతే ఈ సినిమాకు తెలుగులో ఎంత ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎంత లాభం వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజాం ఏరియాలో 1.55 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 40 లక్షలు , ఉత్తరాంధ్రలో 52 లక్షలు , ఈస్ట్ 22 లక్షలు , వేస్టు లో 20 లక్షలు , గుంటూరు లో 32 లక్షలు , కృష్ణ లో 35 లక్షలు , నెల్లూరు లో 18 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు టోటల్ బాక్సాఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.64 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి. 

ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. దానితో ఈ సినిమా ఫైనల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 3.64 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి 64 లక్షల లాభాలను అందుకొని తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత విజయ్ , ఏ ఆర్ మురగదాస్ కాంబోలో కత్తి , సర్కార్ అనే రెండు సినిమాలు రూపొందాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: