- స్టార్ నిర్మాత కి అల్లుడిగా..
- ప్రియాంక దత్-నాగ్ అశ్విన్ ల లవ్ స్టోరీ..
ప్రభాస్ హీరోగా..దీపికా పదుకొనే హీరోయిన్ గా.. కమల్ హాసన్ విలన్ గా.. అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో భారీ తారాగణంతో విడుదలైన కల్కి 2898 ADమూవీ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత అందరూ ఈ మూవీ తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ గురించే మాట్లాడుకున్నారు. అయితే అలాంటి నాగ్ అశ్విన్ చేసినవి తక్కువ సినిమాలే అయినా బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించారు. మరి అలాంటి ప్రముఖ దర్శకుడి లవ్ స్టోరీ ఏంటి.. ఆయన ఎలా ప్రేమలో పడ్డారు అనేది ఇప్పుడు చూద్దాం..
నాగ్ అశ్విన్ లవ్ స్టోరీ:
సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఎడిటింగ్ వర్క్ నేర్చుకున్న నాగ్ అశ్విన్ ఎడిటర్ అవుతారని అనుకున్నారట. కానీ సడన్ గా ఆయన డైరెక్టర్ గా మారిపోయారు. ఇక డైరెక్టర్ గా మారకముందు శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. ఆ అనుభవంతో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారు. ఇక మొదటిసారి ఈయన దర్శకత్వం వహించిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు.అయితే ఈ సినిమా కంటే ముందే నాగ్ అశ్విన్ యాదోం కీ భారత్ అనే షార్ట్ ఫిలిమ్ ని ఇంగ్లీష్ లో తెరకెక్కించారు. అయితే ఈ షార్ట్ ఫిలిం కి ప్రొడ్యూసర్గా ప్రియాంక దత్ చేసింది. అయితే ఈ షార్ట్ ఫిలిం మంచి హిట్ అవ్వడంతో ఆ తర్వాత నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం స్టోరీ ప్రియాంక స్వప్నలకి చెప్పారట.అయితే ఈ స్టోరీ నచ్చిన ప్రియాం, స్వప్న దత్ లు ఇద్దరు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా చేస్తామని ముందుకు వచ్చారు.