మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో గుంటూరు కారం లాంటి సినిమాలో నటించిన మహేష్ ఆ సినిమాతో ప్రేక్షకుల అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయాడు. ఇక మహేష్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా రెండు దశాబ్దాలుగా ప్రతి ఒక్కరు కలలు కంటున్నారు. ఎట్టకేలకు అది ఈ ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ క్రేజీ ప్రాజెక్టుపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి అంటే .. ఈ సినిమాకు వెయ్యి కోట్ల బడ్జెట్ అవుతుంది అని ... రెండువేల కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందని ఎప్పటికి చర్చలు మొదలయ్యాయి.


ఇది ఇలా ఉంటే టాలీవుడ్ లో ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాల రీ రిలీజ్‌ ట్రెండ్ బాగా కొనసాగుతోంది. మహేష్ బాబు నటించిన కొన్ని సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో పోకిరి - ఒక్క‌డు సినిమాలు ఉన్నాయి. ఇక‌ మురారి సినిమా అయితే ఏకంగా రీ రిలీజ్ లో తొమ్మిది కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ క్రమంలోనే మహేష్ బాబు నటించిన ఓ సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. అది డిజాస్టర్ సినిమా కావటం గమనార్హం.


మహేష్ బాబు - సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన అతిధి సినిమా 2007 విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ అమృత ఆరో రా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేదు. అయితే పాటలు .. మహేష్ బాబు స్టైలిష్ నటన సురేందర్ రెడ్డి టేకింగ్ మాత్రం చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమాను ఇప్పుడు డిసెంబర్ 31న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డేట్ అయితే ఖరారు అయిందని.. అతిధి రీ రిలీజ్ పక్కా అని తెలుస్తుంది. ఈ సినిమాకి ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: