సినీరంగంలో చాలామంది స్టార్స్ ఒకరిని ఒకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోకపోవడం .. విడాకులు తీసుకోవటం చాలా కామన్ అయిపోయింది. అయితే కొంతమంది నటీనట్లు మాత్రం దీనికి భిన్నంగా 50 ఏళ్ళ వయసు వచ్చిన ఎవరిని వివాహం చేసుకోకుండా అలా ఒంటరిగా కాలం గడుపుతున్నారు. అలా 50 ఏళ్లు దాటిన ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం.


ట‌బు :
ట‌బు బాలీవుడ్లో అందరూ అగ్ర హీరోల సరసన హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటు టాలీవుడ్ లోనూ అంద‌రు అగ్ర హీరోల స‌ర‌స‌నా కూడా నటించింది ట‌బు. ఆమె వయసు 50 ఏళ్ళు దాటింది. అయినా ఇంకా వివాహం చేసుకోకుండా అలా ఒంటరిగా ఉండిపోయారు.

సుస్మితసేన్ : ఒకప్పుడు టాలీవుడ్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు నటించిన సుస్మిత స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కూడా 50 ఏళ్ళు దాటుతున్న ఇంకా వివాహం చేసుకోలేదు. మధ్యలో ఒకసారి తనకంటే వయసులో చిన్నవాడు అయిన వ్యక్తితో కొన్నాళ్లు సహజీవనం చేసి ఇప్పుడు అతనికి కూడా బ్రేకప్ చెప్పేసింది.


శోభన :
నాగార్జున విక్రమ్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది శోభన. ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించిన నటనతో పాటు డ్యాన్స్ తో ప్రేక్షకులను మైమరిపింప చేసింది. ఆమె వయసు 55 సంవత్సరాలు దాటిన ఇంకా వివాహం చేసుకోలేదు.

దివ్య దత్త : బాలీవుడ్ నటిమని దివ్య దత్త వ‌య‌స్సు కూడా 50 దగ్గరికి వస్తున్న ఇంకా పెళ్లి చేసుకోలేదు.. కారణం అడిగితే సరైన వ్యక్తి దొరకలేదని దొరికితే వివాహం చేసుకుంటానని సమాధానం చెప్పింది.

అమీషా పటేల్పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది అమీషా పటేల్. ఆ తర్వాత తెలుగులో పలువురు హీరోల పక్కన పలు సినిమాలలో నటించింది. ఆమె వయసు 55 ఏళ్లు దాటుతున్న ఇంకా ఒంటరిగానే జీవిస్తోంది.


నగ్మా : చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించింది నగ్మా. ఒకప్పుడు నగ్మా తన అందచందాలతో సౌత్ సినిమా ఇండస్ట్రీ తో పాటు నార్త్ ఇండియన్ ఒక ఊపు ఊపేసింది. ఆమె వయసు కూడా 50 ఏళ్లు దాటిన ఇంకా పెళ్లి చేసుకోకుండా అలా ఒంటరిగానే ఉండిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: