పై స్టేట్మెంట్ ఇచ్చింది మరెవ్వరో కాదు... ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సతీమణి. అవును, ఆమె స్వయంగా ఈ విషయాన్ని తెలియజేసారు. ఇక నటుడు మోహన్ లాల్ గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలెక్టివ్ గా పాత్రలు చేస్తూ వివాదాలకు దూరంగా ఉండే మోహన్ లాల్ అంతే సినిమా ప్రేక్షకులకు అమితమైన ఇష్టం. కేవలం మలయాళ ప్రేక్షకులకే కాకుండా సౌత్ ప్రేక్షకులకు కూడా మోహన్ లాల్ అంటే ఒకింత అభిమానం ఎక్కువనే చెప్పుకోవాలి. వృత్తిపరంగా ఎప్పుడూ సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్న ఈయన.. వ్యక్తిగత జీవితంలో కూడా అంతే సంతోషంగా ఉంటారనే విషయం విదితమే.

ఆయన వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, అందరిలాగే ఈయన కూడా ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మోహన్ లాల్ భార్య సుచిత్ర ఒక ఇంటర్వ్యూలో తమ ప్రేమ, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మోహన్ లాల్ తో మొదలైన ఆమె ప్రేమాయణం మొదలై.. పెళ్లి వరకు ఎలా వెళ్ళింది? అనే విషయంపై ఎక్కువగా మాట్లాడారు. మధ్యమధ్యలో సినిమాల గురించి కూడా ప్రస్తావిస్తూ పై విధంగా స్పందించారు. మోహన్ లాల్ అసలు పేరు చేతన్. అతనిని సుచిత్ర మొదటిసారి తిరువనంతపురంలో జరిగిన ఒక పెళ్లి వేడుకలో చూసి ప్రేమలో పడిపోయారట. అప్పుడే వారి రెండు కుటుంబాలకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నట్టు తెలుసుకున్నారట. దాంతో ఆమె ఎవరో తెలియకుండా మోహన్ లాల్ కి ఉత్తరాలు రాయడం ప్రారంభించారట. అలా మొదలైన వారి ప్రేమ ఎదోలాగా పెళ్ళిపీటల వరకు తీసుకెళ్లారట సుచిత్ర.

ఈ క్రమంలో సదరు యాంకర్ ఆయన సినిమాల గురించి ప్రస్తావించినప్పుడు.. నా భర్త సినిమాలో నాకు రొమాంటిక్ సినిమాలు అస్సలు నచ్చవు.. అందుకే వాటిని చూద్దామన్నా చూడను. ఎంతైనా ఆయన భార్యను కదా! అంటూ నవ్వేసింది. ఇక ఆమె మోహన్ లాల్ ని పేరు పెట్టి పిలవకుండా ‘సుందర కుట్టప్పన్’ (అందమైన అబ్బాయి) అంటూ ఒక కోడ్ భాషలో పిలిచే వారట. వారికి పెళ్లి అయినంత వరకు తానే ఉత్తరాలు పంపిన విషయం మన హీరోగారి తెలియదట. పెళ్లి తర్వాతే ఈ ఉత్తరాల విషయం బయటకు వచ్చింది.. అంటూ వారి లవ్ స్టోరీని తెలిపింది సుచిత్ర. ఈ విషయం విన్న నెటిజన్స్ మీ ప్రేమ మరో సీతారమం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: