టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని వరుసగా క్రాక్ , వీర సింహారెడ్డి సినిమాలతో  బ్యాక్ టు బ్యాక్ రెండు సూపర్ హిట్ ల‌ను అందుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ తో తన తర్వాత సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా గోపీచంద్ మారిపోతున్నాడు. అలాగే ఈ సినిమా తర్వాత బాల‌య్య‌తో మరో సినిమా చేయడానికి గోపీచంద్ రెడీ అవుతున్నాడు. అయితే గతంలో గోపీచంద్ ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.


అసలు మేటర్ లోకి వెళితే హైదరాబాదులోని పెద్దమ్మతల్లి గుడి సాక్షిగా గోపీచంద్ మ‌లినేని ప్రేమకథ మొదలైందట. గోపీచంద్ ఆ సమయానికి రవితేజతో డాన్ శ్రీను సినిమా తీసి హిట్ దర్శకుడుగా క్రేజ్ తెచ్చుకున్నాడు. అదే సమయంలో వెంకటేష్ తో బాడీగార్డ్ సినిమా తీసి కెరియర్లో తొలి డిజాస్టర్ అందుకున్నాడు. గోపీచంద్ కు పెద్దమ్మ తల్లి అంటే ఎంతో ఇష్టం.. ఆయనకి సమయం దొరికినప్పుడల్లా ఆ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటాడు. అయితే ఒక రోజు ఆ గుడికి వెళ్ళగా గోపీచంద్ ఓ అమ్మాయిని చూడటం తొలిచూపులోనే ఆమె తన భార్యగా ఉంటే బాగుంటుందని అనుకోవటం.. ఆ త‌ర్వాత ఆమె ఎవ‌రు ? ఎక్క‌డ ఉంటోంది ? ఏం చేస్తోంది ? అన్న‌ది తెలుసుకోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయ‌ట‌.


గోపీచంద్ కు అప్పటికే రెండు వరస విజయాలు పడటంతో పాటు వెంకటేష్ తో సినిమా ను డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో చాలా మంది సెల్ఫీలు ఆటోగ్రాఫ్లు తీసుకునే వారట అలా ఆ అమ్మాయి వెంటపడి ఆమిది ఏలూరు అని తెలుసుకున్నాడట. మొత్తానికి ఆ అమ్మాయిని కూడా ఒప్పించేశాడు. టాలీవుడ్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న ఎల్విఆర్ ద్వారా ఆమె ఫ్యామిలీ వివరాలు తెలుసుకొని ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ను పెళ్లి మ్యాటర్ గురించి అడిగించారట. అయితే ఆమె త‌ల్లిదండ్రులు మాత్రం సినిమా వాడికి పిల్ల‌ను ఇవ్వం అని చెప్పేశార‌ట‌. సినిమా వాళ్ల‌కు చాలా చెడు అల‌వాట్లు ఉంటాయ‌న్న ఆలోచ‌న‌తో ఆమె కుటుంబ స‌భ్యులు ఉన్నార‌ట‌. చివ‌ర‌కు గోపీ గురించి వాళ్లు కూడా ర‌క‌ర‌కాల కోణాల్లో ఎంక్వైరీ చేశాక అప్పుడు పెళ్లికి ఒప్పుకున్నార‌ట‌. అలా గోపీచంద్ ప్రేమ పెళ్లిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: