రమ్యకృష్ణ తన కెరియర్ లో ఎంతోమంది ఆగ్ర హీరోలతో కలిసి నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. తాను నటించిన సినిమాలన్నీ చాలా వరకు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అందులో నాగార్జున హీరోగా, కృష్ణవంశీ దర్శకత్వంలో చంద్రలేఖ సినిమా వచ్చింది. ఇందులో ఈషా కొప్పికర్ సెకండ్ హీరోయిన్ గా చేసింది. రమ్యకృష్ణ మొదటి హీరోయిన్ కీలక పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో రమ్యకృష్ణ కృష్ణవంశీ మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.
సినిమా పూర్తవుతున్న సమయంలో కృష్ణవంశీ తన ప్రేమ విషయాన్ని రమ్యకృష్ణకు చెప్పాడు. రమ్యకృష్ణ కొద్ది రోజులకు ఓకే చెప్పింది. అలా వారి ప్రేమ విషయాన్ని ఎక్కడ బయట పెట్టకుండా ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత వీరు 2003లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ఏడేళ్ల పాటు చాలా సీక్రెట్ గా వారి ప్రేమను కొనసాగించారు.
ఇంట్లో చూపించిన పెళ్లి సంబంధం నచ్చక ... హైదరాబాద్ లో హడావిడిగా కృష్ణవంశీని రమ్యకృష్ణ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం కృష్ణవంశీకి పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా రమ్యకృష్ణ మాత్రం వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. తల్లి, అత్త వంటి కీలక పాత్రలను పోషిస్తూ తన హవాను కొనసాగిస్తోంది.