సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య వార్ ఎంత హద్దులు మీరిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం . రోజు రోజుకి లిమిట్స్ క్రాస్ చేసేస్తున్నారు మెగా ఫాన్స్ . అదేవిధంగా బోల్డ్ గా కౌంటర్స్ వేస్తున్నారు అల్లు ఫ్యాన్స్.  దీంతో సోషల్ మీడియా మొత్తం మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ తో నిండిపోయింది . తాజాగా చిరంజీవి ఒకప్పుడు ఒక ఈవెంట్ లో మాట్లాడిన మాటలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు మెగా ఫాన్స్ . పరోక్షకంగా ఆ మాటలు అల్లు అర్జున్ కే వర్తిస్తాయి అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు .


మనకు తెలిసిందే చిరంజీవి ఎప్పుడు..? ఎక్కడ..? కూడా పేరుతో పలుకుబడితో పైకి రాకూడదు అని.. పరోక్షకంగా నాన్న పేర్లు తాతల పేర్లు చెప్పుకొని పైకి రాకూడదు అని.. అలా పేర్లు చెప్పకూడదు అంటూ కూడా ఓపెన్ గానే తన మాటలతో చెప్తూ ఉంటారు." ఎప్పుడు మా నాన్న , మా తాత అని ఈవెంట్స్ లో మాట్లాడుతూ ఉంటే నాకు నచ్చదు . ఎవరికి వారు తమ టాలెంట్ తో తమ ఇమేజ్ ని పెంచుకోవాలి..మెగా ట్యాగ్ నుండి బయటపడితే అంతకంటే నాకు ఆనందమేమి ఉంటుంది " అంటూ చెప్పుకొచ్చారు .



అయితే పరోక్షంగా అల్లు అర్జున్ ని మెగా ట్యాగ్ తీసేయ్ అన్న విధంగానే చిరంజీవి మాట్లాడాడు అంటూ అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు కొందరు పనిపాట లేని బ్యాచ్. అంతేకాదు ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మెగా ట్యాగ్ ను ఉపయోగించుకునిందే లేదు . మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియోని ట్రెండ్ చేస్తూ మెగా అభిమానులు పరోక్షంగా అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్నారు . అంతేకాదు ఇక మెగా ఫ్యామిలీ - అల్లు ఫ్యామిలీ కలిసేది లేదు అంటూ కూడా తేల్చేస్తున్నారు . కొంతమంది ఘాటుగా అసలు మెగాస్టార్ చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ కి లైఫ్ నే లేదు అంటూ కూడా ఘాటుగా స్పందిస్తున్నారు . కానీ చిరంజీవి మాత్రం చాలా కూల్ గా మాట్లాడారు అని .. అందరికీ వర్తించే విధంగానే మాట్లాడారు అని ..కొందరు పనీపాటా లేని బ్యాచ్ మాత్రం ఈ వీడియోని పెద్ద రాద్ధాంతం చేస్తుంది అంటూ సినీ ప్రముఖులు సైతం మెగా వెర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ లో తలదూరుస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: