పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే అందరికీ మూడు పెళ్లిళ్ల ప్రస్తావనే వస్తుంది.ముఖ్యంగా ఈయనని టార్గెట్ చేసి మాట్లాడే వారు ఈయన అంటే నచ్చని వారు కచ్చితంగా ఈయన మూడు పెళ్లిళ్ల విషయాన్ని ముందుగా ప్రస్తావిస్తూ ఆయనపై నెగటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారు.సనాతన ధర్మాన్ని కాపాడాలి అది చేయాలి ఇది చేయాలి అని మాట్లాడేవాడు మరి మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు.. ఇద్దరు భార్యలకు అన్యాయం చేసి మూడో భార్యతో ఎలా ఉంటున్నారు అంటూ ఇలా ఎంతో మంది ఆయనని టార్గెట్ చేసి ఆయనను వ్యక్తిగతంగా దూషిస్తూ ఉంటారు.కానీ పవన్ కళ్యాణ్ ని ఎంతమంది దూషించిన వారందరికీ ఆయనే కరెక్ట్ మొగుడు అన్నట్లు కరెక్ట్ సమాధానం చెబుతూ ఉంటారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యాక ఆయనపై విమర్శలు ఎక్కువయ్యాయి. కానీ వాటన్నింటిని పట్టించుకోకుండా ఆయన తన పాలనపై దృష్టి పెట్టి అభివృద్ధి కోసమే పాటు పడుతున్నారు. 

అయితే అలాంటి పవన్ కళ్యాణ్ పై తాజాగా స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మూడు కాదు 30 పెళ్లిళ్లు చేసుకుంటారు అంటూ ఆయన మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ మూడు కాదు 30 పెళ్లిళ్లు చేసుకుంటారు అని మాట్లాడిన ఆ హీరో ఎవరో కాదు సీనియర్ నటుడు సుమన్.. అయితే ఈయనకు పవన్ కళ్యాణ్ పై ఉన్న కోపం ఏంటి.. ఎందుకు ఆయన అలా మాట్లాడారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఆయన పవన్ కళ్యాణ్ పై కోప్పడలేదు ఆయనకు సపోర్ట్ గానే మాట్లాడారు. అది ఎలా అంటే.. పవన్ కళ్యాణ్ ని చాలామంది వ్యక్తిగతంగా దూషిస్తూ ఉన్నారు. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని పదేపదే అదే మాట్లాడుతున్నారు.

ఆయన పెళ్లిళ్లు చేసుకోవడం అనేది ఆయన పర్సనల్ విషయం.ఆయన మూడు పెళ్లిళ్లు కాదు 30 పెళ్లిళ్లు చేసుకుంటారు.అది పూర్తిగా ఆయన వ్యక్తిగతం.. దాని గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు అని విమర్శిస్తున్నారు.కానీ ఆయనకు లేని బాధ మీకు ఏంటి.. ఆయన్ని విమర్శించాల్సిన అవసరం ఏముంది.ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా నేను ఎప్పటికీ పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూనే ఉంటాను అంటూ నటుడు సుమన్ రీసెంట్ గా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఈ విషయాన్ని మాట్లాడారు. దీంతో నటుడు సుమన్ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన పవర్ స్టార్ అభిమానులు సుమన్ మాటలను మెచ్చుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: