సినిమా అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కాంబినేషన్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ... దర్శక ధీరుడు రాజమౌళి. దాదాపు రెండు దశాబ్దాల నుంచి మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందా ? అని అందరూ ఒకటే ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ రెండు దశాబ్దాలలో రాజమౌళి ఇమేజ్ - మహేష్ బాబు ఇమేజ్ చాలా మారిపోయింది.. మహేష్ బాబు తెలుగులోని సూపర్ స్టార్ హీరోగా ఎదిగితే రాజమౌళి భారత దేశమే గర్వించే గొప్ప దర్శకుడు అయిపోయారు. మహేష్ బాబుతో జక్కన్న ఎలాంటి అద్భుతం సృష్టిస్తాడు అని అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి కూడా ఈ ప్రాజెక్టు కోసం తగినంత టైం తీసుకుంటున్నారు. మహేష్ అయితే ఎక్కడా కంగారు పడటం లేదు. రాజమౌళి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ లోగా వర్క్ షాప్ లు జరుగుతున్నాయి .. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కథ వారణాసి నేపథ్యంలో మొదలవుతుందని ఇన్సైడ్ వర్గాల టాక్. ఆ తర్వాత కథ దక్షిణాఫ్రికాకు షిఫ్ట్ అవుతుందట. సినిమాకు వారణాసి నేపథ్యం ఉండడంతో పరమ శివుడికి కూడా కథతో లింక్ ఉంటుందంటున్నారు. వారణాసి షెడ్యూల్ మొత్తం ఓ సెట్ లో పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. అందుకోసం హైదరాబాద్ శివార్ల లో భారీ సెట్ తీర్చిదిద్దుతున్నారు. తొలుత ఇక్కడ షూటింగ్ ప్రారంభించి ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు వెళ్తారు. అక్కడ అటవీ నేపథ్యంలో సాగే సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందుకే దట్టమైన ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించారు.
ఎక్కడెక్కడ ? షూట్ చేయాలి అనే విషయంపై ఓ అంచనాకు సైతం వచ్చారు. పేపర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ముందుగా వారణాసి నగరం ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత దక్షిణాఫ్రికా అడవుల్లో షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మ్యూజిక్ సిటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఇండోనేషియా కు చెందిన ఓ హీరోయిన్ ను ఈ సినిమా కోసం ఎంచుకుందామని అనుకున్నారు. ఆమెపై ఫోటోషూట్ కూడా నిర్వహించారు.. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.