టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో భారీ పాన్ వరల్డ్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన లొకేషన్ వేటలో ఉన్నాడు. రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను ఎవరు ఊహించిన రీతిలో సిద్ధం చేశాడు. ఇక సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని కూడా అంటున్నారు. ఈ సినిమాతో మహేష్ బాబు పాన్ వరల్డ్ హీరోగా మారిపోతున్నాడు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు మహేష్ బాబుకు ఓ డేరింగ్ పర్సన్ లైవ్ లో వార్నింగ్ ఇచ్చాడని వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.


అసలు మేటర్ లోకి వెళితే మహేష్ బాబు తెలంగాణ మాజీ సీఎం కొడుకు కేటీఆర్ అలా పిలవకు అని లైవ్ లో స్వీట్ వార్నింగ్ ఇచ్చారట.. దీనికి సంబంధించిన ఓల్డ్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. భరత్ అనే నేను సినిమా ప్రమోషన్ లో ఓ ఈవెంట్లో కేటీఆర్ , మహేష్ బాబు , కొరటాల శివ కూడా పాల్గొన్నారు. ముందుగా ఈవెంట్ కి హాజరైన కేటీఆర్ సార్ కి ధన్యవాదాలు అన్నీ మహేష్ బాబు అన్నారు .. వెంటనే కేటీఆర్ నన్ను సార్ అని పిలవకు రామ్‌ని పిలు మరోలా పిలిచినా పర్లేదు సార్ అని పిలిస్తే నేనేదో వయసులో మీకంటే పెద్దోడిని అనే ఫీలింగ్ కలుగుతుంది కావాలంటే దర్శకుడు శివని సార్‌ని పిలుచుకోండి అని అన్నాడు కేటీఆర్.. ఆ మాటలకు మహేష్ ఒకంత షాక్ అయ్యారట.


 ఇంకా మహేష్ బాబు మాట్లాడుతూ.. కేటీఆర్ నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆయన సినిమా బాగుంటే చెప్తారు లేదంటే చెప్పరు. ఆగడు మూవీ చూసి నాకు ఫోన్ చేసి తిట్టారు. ఇలాంటి చెత్త సినిమాలు చేయకండి , అన్నారు. ఆ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. అంత హానెస్ట్ గా కేటీఆర్ తన అభిప్రాయం వ్యక్తపరుస్తారు. నా మూవీ విడుదలైతే , కేటీఆర్ రెస్పాన్స్ ఏమిటనే ఒక భయం ఉంటుంది. ఇక భరత్ అనే నేను మూవీలో నా రోల్ డిజైన్ చేయడంలో కేటీఆర్ ని స్ఫూర్తిగా తీసుకున్నాం. కేటీఆర్ లైఫ్ స్టైల్ కి కొంచెం దగ్గరగా, భరత్ అనే నేను మూవీలో నా క్యారెక్టర్ ఉంటుంది, అన్నారు. అలా ఆ ఇంటర్వ్యూలో మహేష్ కు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: