మన తెలుగు చిత్ర పరిశ్రమంలో అక్కినేని కుటుంబానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. అలాంటి గొప్ప ప్రత్యేకత తెచ్చి పెట్టిన అక్కినేని నాగేశ్వరరావు.. ఆయన తర్వాత తన నట వారసుడిగా ఆయన కొడుకు నాగార్జునను తెలుగులో హీరోగా పరిచయం చేశాడు . నాగార్జున కెరియర్ మొదటిలో ఎన్నో అవమానాలకు గురయ్యాడు ... నాగ్‌ కు  సినిమాలలోకి  రాకముందే రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మీ తో పెళ్ళి జ‌రిగింది . ఆ తర్వాత విక్రమ్ సినిమాతో తెలుగులో హీరోగా పరిచయమయ్యాడు నాగార్జున .  మొదటి సినిమా తోనే ఘోరమైన పర‌జ‌యం అందుకున్న నాగార్జున ఆ తర్వాత గీతాంజలి , ప్రెసిడెంట్ గారి పెళ్ళాం , శివ వంటి సినిమాల తో వరుస విజయాలను అందుకుని తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు .


నాగార్జున కు లక్ష్మికి పెళ్లయిన కొన్ని సంవత్సరాలకే వీరిద్దరి మధ్య మనస్పర్ధల కారణం గా విడాకులు తీసుకున్నారు . ఇక్పటికే వీరికి నాగచైతన్య జన్మించాడు . లక్ష్మితో విడాకులు తీసుకున్న తర్వాత నాగార్జున - అమలతో ప్రేమలో పడ్డాడు . వీరిద్దరూ కిరాయి దాదా అనే సినిమాలో కలిసి జంటగా నటించారు . ఆ సమయం లోనే వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది . ఆ తర్వాత శివ సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి జంటగా నటించారు . ఈ సినిమాతో వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది .  అయితే వీరి పెళ్లికి అక్కినేని నాగేశ్వరరావు ఒప్పుకోకపోవడంతో కిరాయి దాదా సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన దొరస్వామి రాజు వీరి పెళ్లిని దగ్గర ఉండి తిరుమలలో జరిపించాడు.


ఇక పెళ్లి తర్వాత అమల చిత్ర పరిశ్రమ కు దూరమైంది . ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉంది. వీరిద్దరికీ అఖిల్ జన్మించాడు. ప్రస్తుతం అఖిల్ కూడా టాలీవుడ్ లో వరుస‌ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అప్పట్లో వీరి పెళ్లి ఒక సంచలనంగా మారింది. ప్రస్తుతం నాగార్జున కొడుకు నాగచైతన్య సమంతకు విడాకులు వచ్చిన తర్వాత మరో హీరోయిన్ శోభితతో ప్రేమలో పడ్డాడు.. డిసెంబర్ 4న వీరి పెళ్లి ఘనంగా జరగబోతుంది. ఈ క్రమంలోని నాగార్జున అమలా పెళ్లికి సంబంధించిన ఈ వార్త వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: