హీరోయిన్ రోజా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అప్పుడు స్టార్ హీరోయిన్గా ఎదిగీ టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలతో కలిసి నటించింది. ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ రాజకీయాల్లో కూడా దూసుకుపోతుంది. అయితే రోజా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు పడిందట. రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ప్రేమ తపస్సు అనే సినిమాతో ఈమె తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో రోజా యాక్టింగ్ బాగున్నా కానీ తర్వాత అవకాశాలు మాత్రం రాలేదు. ఈ క్రమంలోనే శోభన్ బాబు హీరోగా వచ్చిన సర్పయాగం సినిమా చేయడానికి ప్లాన్ చేశారు. ఆ సినిమాలో శోభనబాబు కూతురుగా ముందుగా మరో స్టార్ హీరోయిన్ మీనాని అనుకున్నారు. ఆ సినిమాలో కూతురు పాత్ర చనిపోతుంది అప్పటికే మీనా స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ అందుకుంది. అలాంటి సమయంలో మీనా ఈ పాత్ర చేస్తే బాగుండదని ఆమెను తప్పించారు.
ఇక దాంతో పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాలో ఎవరైనా కొత్త అమ్మాయిని తీసుకోవాలని ఎదురు చూస్తున్నారు .. ఈ క్రమంలోనే రోజా గురువు శివప్రసాద్ పరుచూరి బ్రదర్స్ ని కలిసి ప్రేమ తపస్సు సినిమా చూడాలని చెప్పారట. అందులో రోజా యాక్టింగ్ గమనించిన వారు ఈ అమ్మాయి బాగా సెట్ అవుతుందని భావించి సర్పయాగం సినిమాలో అవకాశం ఇచ్చారట. దాంతో ఆ రోజాకు ఈ సినిమా మంచి పేరు తీసుకు వచ్చింది అప్పటినుంచి రోజా కి సినిమాల్లో హీరోయిన్గా వరుస అవకాశాలు వచ్చాయి. అలా రోజా తర్వాత టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు వరుస సినిమాల్లో నటించి సౌత్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.