మన తెలుగు చత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి దాదాపు అందరికి తెలిసిందే .. మరీ ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ ముందుకు దూసుకు వస్తున్నాడు చిరు.. హిట్ ప్లాప్‌ల‌ తో సంబంధం లేకుండా వరుస‌ సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక మెగాస్టార్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వశిష్టాతో విశ్వంభ‌ర మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని భావించిన .. ఆ సమయంలో రామ్ చరణ్ గేమ్ ఛెంజర్ మూవీ రిలీజ్ చేయటంతో విశ్వంభ‌ర సినిమాని సమ్మర్ కు పోస్ట్ ఫోన్ చేశారు. అయితే ఇప్పుడు చిరంజీవికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


చిరంజీవి కెరియర్ లో ఆయన వ్యక్తిచిరంజీవి కెరియర్ లో ఆయన వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడ్డ కొన్ని సినిమాలు చిరంజీవి పరువు తీసాయి .. ఓ సినిమా రెండుసార్లు సెన్సార్ కి వెళ్లి చిరంజీవి పరువును గంగపాలు చేసింది. ఆ సినిమా మరేదో కాదు.. చిరంజీవి హీరోగా విలక్షణ దర్శకుడు ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన అల్లుడా మజాకా. ఈ సినిమాలో చిరంజీవి హీరో అయితే రమ్యకృష్ణ - రంభ హీరోయిన్లగా నటించారు.. వీరి తల్లి పాత్రలో సీనియర్ నటి వాణిశ్రీని నటింప చేయాలని ముందుగా దర్శకుడు అనుకున్నారట. ఆమెను కలిసి పాత్రను వివరించాడు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలో వాణి శ్రీ అత్తగా చిరంజీవి అల్లుడుగా నటించారు. మరోసారి అల్లుడా మజాకా చిత్రంలో వాణి శ్రీకి అత్త పాత్రలో నటించే అవకాశం లభించినా ఆమె తిరస్కరించారు.


ఇక వాస్తవానికి చిరంజీవి , వాణిశ్రీ కలిసి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సూపర్ హిట్ మూవీలో నటించారు. నటిగా వాణిశ్రీకి ఈ సినిమా రీ ఎంట్రీ మూవీ. అత్త, అల్లుడు పాత్రలో చిరంజీవితో ఢీ అంటే ఢీ అనేవిధంగా వాణి శ్రీ నటించింది. అయితే అల్లుడా మజాకా మూవీలో ఓ రే**ప్ సీన్ లో నటించేటటువంటి సన్నివేశాలున్నాయి. ఇక దాంతో వాణిశ్రీ ఈ సినిమాకు నో చెప్పింది. ఆ తర్వాత వాణిశ్రీ ప్లేస్ లో మరో నటి లక్ష్మిని అత్త పాత్రలో తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో కొన్ని సీనులకు సెన్సార్ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఆ రోజుల్లోనే ఈ సినిమా వివాదాస్పదంగా మారింది. అలా ఈ సినిమా చిరంజీవి చిరంజీవి కెరియర్ లోనే బోల్డ్ సినిమాగా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: