"చిరంజీవి".. ఎప్పుడు ..? ఎక్కడ ..? కూడా టంగ్ స్లిప్ అవ్వడు.  ఎంత పెద్ద స్టేజిలో మాట్లాడిన సరే ఆయన హద్దులు మీరకుండా మాట్లాడుతూ ఉంటారు . కొన్ని కొన్ని సార్లు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని పరోక్షకంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి . రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవిని మరోసారి అదేవిధంగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు.  మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రత్యేక స్థా నం ఉంది. గత నాలుగు దశాబ్దాలుగా ఆయన ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఊపి పడేస్తున్నారు. ఆయనను ఇండస్ట్రీ పెద్దగా భావిస్తున్నారు.

రీసెంట్ గా సత్య దేవ్ నటించిన "జీబ్రా" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు చిరంజ్జివి. ఈ సినిమా నవంబర్ 22వ తేదీ రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సత్యదేవ్ కి సపోర్ట్ చేస్తూ  ఈ ఈవెంట్ కి హాజరైయ్యారు. ఈ క్రమంలోనే చిరంజీవి స్టేజ్ పై మాట్లాడుతూ ..ఒకానొక మూమెంట్లో టంగ్ స్లిప్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది . "మరీ ముఖ్యంగా మనోళ్ళకి మనవాళ్లే తక్కువ ..కోకువ" అంటూ సత్యదేవ్ ని సపోర్ట్ చేయాలి అన్న రేంజ్ లో మాట్లాడారు .

"గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ రోల్ కోసం వేరే వాళ్ళని చూస్ చేసుకుంటాను అని డైరెక్టర్ చెప్పారని ..కానీ నేను సత్యదేవ్ నే చూస్ చేసుకోమని చెప్పాను అని ..మనోళ్ళలో టాలెంట్ పెట్టుకొని పక్క వాళ్ళని ఏంటి అడగటం" అంటూ అప్పుడే చెప్పేశాను అని చెప్పుకొచ్చారు . అయితే చిరంజీవి ఎప్పుడూ కూడా స్టేజిపై ఇలాంటి మాటలు మాట్లాడింది లేదు . కానీ ఈసారి ఎందుకు ఈ రేంజ్ లో మాట్లాడారు అంటే మాత్రం ఓ డైరెక్టర్ కారణమని చెప్పుకుంటున్నారు జనాలు .

ఈ మధ్యకాలంలో ఓ డైరెక్టర్ మెగా ఫ్యామిలీకి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు . మరీ ముఖ్యంగా మెగా హీరోస్ కెరియర్లో సెటిల్ కాకపోవడంపై దారుణంగా పరోక్షకంగా స్పందిస్తున్నారు . ఈ క్రమంలోనే ఆ డైరెక్టర్ కి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చేలా ఈ విధంగా కౌంటర్ వేశారు అని చెప్తున్నారు మెగా ఫాన్స్ . అంతేకాదు ఆ డైరెక్టర్ హీరోని తప్పిస్తే మిగతా ఎవరిని కూడా తెలుగు వాళ్లకు ఛాన్స్ ఇవ్వడు అని.. బాలీవుడ్ - మలయాళం ఇండస్ట్రీలకే ఛాన్స్ ఇస్తూ ఉంటాడు ..ఆ కారణంగానే ఇలా ఘాటుగా బదులిచ్చాడు చిరంజీవి అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు".

మరింత సమాచారం తెలుసుకోండి: