కొందరు వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వెళ్తూ కూడా దారుణతి దారుణంగా మీమ్‌శ్ క్రియేట్ చేసి ట్రోల్ చేశారు . తాజాగా ఒక మీమ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అక్కినేని నాగచైతన్యకి ఇది రెండో పెళ్లి అన్న సంగతి అందరికీ తెలిసిందే . సమంతను ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసి ..ఇప్పుడు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో పెళ్లికి సిద్ధమయ్యాడు నాగచైతన్య . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మీమ్‌స్ బాగా పెరిగిపోయాయి .
కాగా వీళ్ళ పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ జరగబోతుంది అంటూ సమాచారం అందుతుంది . దీంతో సోషల్ మీడియాలో దానికి తగ్గట్టు మీమ్‌స్ కూడా ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు. "అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి చేస్తున్నారు.. రేపు ఒకవేళ వీళ్ల మధ్య గొడవలు వచ్చి విడిపోతే అది పెళ్లి కాదు షూటింగ్ అంటూ చెప్పుకొస్తారేమో..?" అంటూ తెగ కామెడీని పండించే రేంజ్ లో మీమ్స్ క్రియేట్ చేసి టృఎండ్ చేస్తున్నారు . కానీ ఇది అక్కినేని ఫ్యాన్స్ కి మాత్రం చాలా హర్టీంగ్గా ఉంది . శుభమాను పెళ్లి చేసుకుంటూ ఉంటే డివర్స్ అంటూ శాపనార్థాలు ఏంటి ..? అలాంటి తప్పుడు మాటలు ఏంటి ..? అంటూ బాధపడిపోతూ మండిపడుతున్నారు . కొంతమంది ఇంతకు తెగించేసారేంటిరా బాబు ..? ఈ మీమర్‌స్ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!