అయితే ఒకానొక ఇంటర్వ్యూలో స్వయాన చిరంజీవినే ఈ విషయాన్ని బయట పెట్టడం గమనార్హం. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న ఈ హీరో ఇప్పుడు కూడా అదే విధంగా సినిమాలల్లో నటిస్తూ క్రేజీ క్రేజీ హిట్స్ అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు. పలు ప్రీ రిలీజ్ ఈవెంట్లకి కూడా అటెండ్ అవుతూ స్పెషల్ అట్రాక్షన్ గా కూడా నిలుస్తున్నారు . కాగా చిరంజీవి అంటే చాలా అందగాడు ..మంచి మనిషి.. డాన్సర్ కూడా అని ఎప్పుడూ జనాభా మాట్లాడుకుంటూ ఉంటారు.
అలాంటి చిరంజీవి ఒక స్టార్ హీరో లుక్స్ చూసి కుళ్ళుకున్నాడట. ఈయనకి ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఇంతమంది లేడీస్ ఆయనని ఇష్టపడుతున్నారే అంటూ బాగా జలసీగా ఫీలయ్యారట. ఆఖరికి తన సొంత భార్య సురేఖ కూడా ఆ హీరో ఫ్యాన్ అని తెలిసి షాక్ అయిపోయారట. ఆయన మరెవరో కాదు ఆంద్ర అందగాడు శోభన్ బాబు . శోభన్ బాబు లుక్స్ ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలా ..? చాలామంది స్టార్ హీరోల భార్యలు ఆయన ఫ్యాన్స్ . మరి ముఖ్యంగా శోభన్ బాబు తన లుక్స్ కోసమే ప్రత్యేకంగా ఫోకస్ చేసేవారు.
అప్పట్లో ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు కూడా సినిమాలు పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది . అంతేకాదు చిరంజీవి - శోభన్ బాబు లుక్స్ చూసి బాగా జలసిగా ఫీల్ అయ్యారట . అందుకే ఆయనలా హ్యాండ్ సమ్ లుక్స్ రావాలి అంటూ ఆయన హెయిర్ స్టైల్ ని కూడా అద్దం ముందు నిల్చుని ట్రై చేసేవాడట . ఇది చూసిన సురేఖ కూడా షాక్ అయిపోయిందట. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టి చిరంజీవి నవ్వుల పూయించాడు..!