టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశి కన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా ఆమె కొనసాగుతున్నారు. అయితే అలాంటి రాశి కన్నా.. జీవితం గురించి ఓ చీకటి కోణం బయటికి వచ్చింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాశి కన్నా  ను ఓ వ్యక్తి దారుణంగా మోసం చేసి... వాడుకొని వదిలేసాడట. ప్రేమ పేరుతో మోసం చేశాడట. ఈ విషయాలను స్వయంగా టాలీవుడ్ హీరోయిన్  రాశి కన్నా చెప్పడం జరిగింది.

 టాలీవుడ్ ఇండస్ట్రీలో రాసి కన్నా కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ 2013 లోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మద్రాస్ కేఫ్  సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత అక్కినేని కుటుంబం నటించిన మనం సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ సినిమాలో అతిధి పాత్ర చేసినప్పటికీ ఆమెకు మంచి మార్కులే పడ్డాయి.  ఆ తర్వాత ఇండస్ట్రీలో దూసుకు వెళ్ళింది.

 2014 సంవత్సరంలో ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రాశి కన్నా. ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు ఈ బ్యూటీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోలు అందరి సరసన సినిమాలు చేసి... అందరిని మెప్పించింది. జిల్, సుప్రీమ్, జై లవకుశ, రాజా ది గ్రేట్ లాంటి సినిమాలు చేసి... మంచి హిట్లు అందుకుంది. అయితే అలాంటి రాశిఖన్నాను ఓ వ్యక్తి వేధించాడట.

 తన ప్రియుడితో బ్రేకప్ చెప్పిన తర్వాత తాను ఎంతో బాధపడ్డాను అని తాజాగా... హీరోయిన్ రాశి కన్నా చెప్పడం జరిగింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని... ఈ విషయాలపై... మాట్లాడింది రాశి కన్నా. గతంలోనే తనకు ఒక లవ్ స్టోరీ ఉందని ఆమె పేర్కొంది. చిన్న చిన్న కారణాలవల్ల మేము విడిపోయామని కూడా చెప్పింది. ఆ సమయంలో ఎంతో బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేసింది. కుంగిపోయినట్లు తెలిపింది. ఇప్పుడు తన ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్స్... తన అండగా ఉన్నారని వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: