కంగువ సినిమా పబ్లిక్ టాక్ విషయానికి వస్తే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఈ సినిమాలోని పిరియాడిక్ ఇంట్రడక్షన్ సన్నివేశాలు బాగున్నాయని కానీ కొన్ని సన్నివేశాలలో హీరో, విలన్ల మధ్య బిల్డప్ సన్నివేశాలు చాలా చిరాకుగా తెప్పించాయని సినిమా చూసిన ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. సూర్య ఇంటెన్స్ పెర్ఫార్మషన్స్ తో మాత్రం అదరగొట్టేసారని.. మ్యూజిక్ దేవిశ్రీప్రసాద్ కూడా బాగా అందించారని డైరెక్టర్ శివ ఫైట్స్ విజువల్స్ కు ప్రాధాన్యత కల్పించారని మొదటి భాగం యావరేజ్ ఉందని సెకండాఫ్ మాత్రం అందర్నీ డిసప్పాయింట్ చేసిందంటూ కొందరు ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. మరి ఏ మేరకు ఈ సినిమా పూర్తి రివ్యూ తెలియాలి అంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. తెలుగులో కూడా కంగువ చిత్రానికి అనుకున్నంత స్థాయిలో థియేటర్లో దొరకలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు తీసుకున్నప్పటికీ కూడా థియేటర్ల సమస్య ఏర్పడిందట. మొత్తానికి ఎవరు ఊహించని టాక్ తో కంగువ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.. మరి సూర్య పడిన కష్టానికి తగ్గ ఫలితం రాలేదని అభిమానులైతే వాపోతున్నారు.