తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న సంగీత దర్శకులలో అనుప్ రూబెన్స్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలకు సంగీతాన్ని అందించినప్పటికీ వాటి ద్వారా ఈయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. అలా పెద్దగా క్రేజ్ లేకుండా కెరియర్ను ముందుకు సాగిస్తున్న సమయంలోనే ఈయన నితిన్ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఇష్క్ అనే సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్గా నటించింది. ఇకపోతే ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు.

దానికి ప్రధాన కారణం ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న నితిన్ కు ఈ మూవీ కంటే ముందు వరుస అపజయాలు ఉండడం , అప్పటివరకు విక్రమ్ కి కూడా భారీ విజయాలు లేకపోవడం , నిత్య మీనన్ కి కూడా పెద్దగా క్రేజీ లేకపోవడం. అలాగే అనుప్ రూబెన్స్ కూడా అప్పటికి మంచి విజయాలు లేకపోవడంతో ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా స్టార్ట్ అయింది. ఈ మూవీ విడుదల అయిన తర్వాత ఈ సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చింది. అలాగే ఈ మూవీలోని మ్యూజిక్ కి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి రావడం మొదలు అయింది. దానితో ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అయింది. ఈ సినిమాతో అనూప్ రూబెన్స్ కి అద్భుతమైన క్రేజ్ వచ్చింది.

విక్రమ్ ఆ తర్వాత నాగేశ్వరరావు , నాగార్జున , నాగ చైతన్య , అఖిల్ లతో మనం అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ కి కూడా అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ విజయంలో కూడా ఈయన అందించిన సంగీతం అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇలా విక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఇష్క్ , మనం సినిమాల విజయంలో అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం అత్యంత కీలక పాత్రను పోషించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: