బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించి హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు పెళ్లి చేసుకుని విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే సల్మాన్ ఖాన్ కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కెరీర్ ను కొనసాగించిన ఓ ముద్దుగుమ్మను ఎంతో ఘాఢంగా ప్రేమించాడట. కానీ కొన్ని కారణాల వల్ల వీరి ప్రేమ విఫలం అయ్యిందట. మరి సల్మాన్ ఖాన్ ప్రేమించిన ఆ హీరోయిన్ ఎవరు ..? ఎందుకు ఆ అమ్మాయిని సల్మాన్ వదిలేశాడు అనే వివరాలను తెలుసుకుందాం.

90 వ దశకంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో జూహి చావ్లా ఒకరు. సల్మాన్ ఖాన్ , జుహీ చావ్లా ను ఎంత గానో ప్రేమించాడట. తనను వివాహం కూడా చేసుకోవాలి అనుకున్నాడట. ఇక తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్న సల్మాన్ ఆమె ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకి కూడా చెప్పాడట. కానీ వారు మాత్రం ఆ పెళ్లికి ఏ మాత్రం అంగీకరించలేదట. దానితో ఏమీ చేయలేక సల్మాన్ ఖాన్ ఆ తర్వాత తనపై ప్రేమను వదులుకున్నాడట. ఇకపోతే ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలోనే అత్యంత సంపన్నురాలుగా జుహీ చావ్లా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమెకు దాదాపు 4600 కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది. హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగి నటులలో అమితా బచ్చన్ ఒకరు. ఈయన కంటే కూడా జుహీ చావ్లా కి ఎక్కువ ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా సల్మాన్ ఖాన్ ప్రేమించిన నటి ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలోనే అత్యంత సంపన్నురాలుగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: