టాలీవుడ్ లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ వుంది.. ఆయన మ్యూజిక్ అందిస్తే చాలు సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది.. దేవిశ్రీ మ్యూజిక్ అందించే ప్రతి సినిమా కూడా కథ పరంగా ఎలా వున్నా కానీ ఆ సినిమాలోని మ్యూజిక్ ఆల్బమ్ సూపర్ హిట్ అవుతుంది.. దేవిశ్రీ తన అద్భుతమైన మ్యూజిక్ తో ప్రేక్షకుల చేత మాస్ స్టెప్స్ వేయించాడు..టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సినిమాలకు దేవిశ్రీ మ్యూజిక్ అందించారు. ఒక మెలోడీ కావాలన్నా, ఒక మాస్ బీట్ కావాలన్న, ఒక ఐటమ్ సాంగ్ కావాలన్న, ఒక దేశభక్తి గీతం కావాలన్న దేవిశ్రీ ఇచ్చే ట్యూన్స్ పర్ఫెక్ట్ గా సరిపోతాయి.. ఇప్పడు దేవిశ్రీ జోరు కాస్త తగ్గినా వింటేజ్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అంటే అప్పట్లో ప్రేక్షకులు పడి చచ్చిపోయేవారు.. అంతలా దేవిశ్రీ తన మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు.. అయితే దేవిశ్రీ ఎన్ని సినిమాలు చేసిన ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం మాత్రం “ఖడ్గం”.. ఈ సినిమా దేవిశ్రీ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ మూవీగా నిలిచింది.. బిగ్గెస్ట్ పేట్రియాటిక్ మూవీగా తెరకెక్కిన ఖడ్గం సినిమా భారీ విజయం సాధించింది..
టాలెంటెడ్ దర్శకుడు కృష్ణవంశీ ఆయన కెరీర్ లో తీసిన ది బెస్ట్ మూవీ “ఖడ్గం”.. ఈ సినిమాకు ప్రాణం కథ.. ఆ కథకు తగ్గట్టు పాత్రలు ఎంచుకున్న కృష్ణవంశీ అప్పుడే సగం విజయం అందుకున్నారు.. ఎలాంటి ఇమేజ్ సెంట్రిక్ సీన్స్ లేకుండా కథ ఎలా ఉంటే అలానే కృష్ణవంశీ తెరకెక్కించారు.. ప్రధాన పాత్రలలో నటించిన శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ తమ పాత్రలలో జీవించారు..సినిమాలో ప్రతి డైలాగ్ కూడా సగటు ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా ఉంటుంది..ఇక ఈ సినిమాకు మెయిన్ అసెర్ట్ మ్యూజిక్.. అప్పుడప్పుడే క్రేజ్ పెంచుకుంటున్న దేవిశ్రీకి కృష్ణవంశీ అవకాశం ఇచ్చారు.. ఇచ్చిన అవకాశాన్ని దేవిశ్రీ అద్భుతంగా ఉపయోగించుకున్నాడు.. ఈ సినిమాకు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను ఓ రేంజ్ కి తీసుకెళ్ళింది.. టైటిల్ సాంగ్ నుంచి చివరి దేశభక్తి గీతం వరకు దేవిశ్రీ అందించిన ఆల్బమ్ మొత్తం ఇప్పటికి మారు మ్రోగుతూనే వుంది.. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పుకుంటే.. కృష్ణవంశీ సృష్టించిన కొన్ని ఎపిక్ సీన్స్ లో దేవిశ్రీ ఇచ్చిన బిజిఎం ఎక్సట్రోర్డినరీ అని చెప్పొచ్చు.. తెలుగులో వచ్చిన దేశభక్తి సినిమాలలో ఖడ్గం సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుంది..