అయితే బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశ పటాని ఈ చిత్రంలో కూడా తన అందచందాలతో మరొకసారి రెచ్చిపోయినటించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం సుమారుగా రూ.3 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి చిత్రానికి కేవలం రూ .2 కోట్లు తీసుకోగా ఇప్పుడు కంగువ చిత్రానికి కల్కి కంటే ఎక్కువగానే తీసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి కంగువ సినిమా కంటే తమిళంలో సంఘమిత్ర అనే చిత్రంలో నటించాల్సి ఉండగా బడ్జెట్ కారణాలవల్ల ఈ సినిమా ఆగిపోయినట్లు సమాచారం. అయితే కంగువ సినిమా కోసం ప్రమోషన్స్ ని భారీగా చేసిన మిక్స్డ్ టాక్ రావడంతో కాస్త చిత్ర బృందం నిరాశలో ఉన్నట్లు సమాచారం.
నిజానికి దిశాపటాని మొట్టమొదటిసారిగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఈ సినిమాతో క్రేజ్ పెరిగిన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడ పలు చిత్రాలలో నటిస్తోంది. బాలీవుడ్ లో గ్లామర్ డాల్ గా పేరు పొందిన ఈ అమ్మడు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో హీరోయిన్గా అన్ని భాషలలో నటించడానికి సిద్ధమయ్యింది. మరి రాబోయే రోజుల్లో అన్ని భాషలలో విజయాలు అందుకోవాలని అభిమానులైతే కోరుకుంటున్నారు