టాలీవుడ్ ఇండస్ట్రీలో థమన్ కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థమన్ తన సినిమాలకు ఇచ్చే మ్యూజిక్ తో పాటు బీజీఎం సైతం వేరే లెవెల్ లో ఉంటుందని చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా మ్యూజిక్ అందించే మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా థమన్ కు మంచి పేరుంది. అయితే మధ్యలో కొంతకాలం పాటు థమన్ కు ఆఫర్లు తగ్గగా అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలు థమన్ కు పూర్వ వైభవం తెచ్చిపెట్టాయి.
 
ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో సైతం అదరగొట్టాయి. థమన్ ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అదరగొట్టాయి. ఈ రెండు సినిమాలు మ్యూజిక్ విషయంలో సైతం అదరగొట్టాయి. ఈ సినిమాలకు బీజీఎం సైతం ప్లస్ అయింది.
 
అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లోనే విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఎన్టీఆర్, బన్నీ రేంజ్ ను ఈ సినిమాలు పెంచాయనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. థమన్ ను అభిమానించే ఫ్యాన్స్ సైతం భారీగా ఉన్నారు.
 
టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోలు సైతం థమన్ కు వరుసగా అవకాశాలను ఇస్తున్నారు. ఈ జాబితాలో బాలయ్య, రవితేజ ముందువరసలో ఉన్నారు. పుష్ప2 సినిమా బీజీఎం కోసం కూడా థమన్ పని చేసిన సంగతి తెలిసిందే. పుష్ప ది రూల్ మూవీకి థమన్ బీజీఎం ఎంతమేర ప్లస్ అవుతుందనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: