దగ్గుబాటి వారసుడు రానా గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన తోటి హీరోలు సూపర్ స్టార్ అనే చట్రంలో ఇరుక్కొని కొట్టుకు చస్తుంటే, అందరి హీరోలలో కూడా విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నది మాత్రం హీరో రానా దగ్గుబాటి మాత్రమే అని చెప్పుకోవచ్చు. అందుకే రానాకి టాలీవుడ్లో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దగ్గుబాటి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రానా రామానాయుడు పేరునే షార్ట్ చేసుకొని రానాగా పెట్టుకున్నాడు. తొలిసినిమా లీడర్ తోనే నటుడిగా మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఆయన కంటెంట్ కి ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎక్కువగ్గా చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే బాక్స్ ఆఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా రానా కి ఒక ప్రత్యెకైమైన ఇమేజ్ ఏర్పడింది.

ఇక బాహుబలి సిరీస్ తో ఆయనకి వరల్డ్ వైడ్ గా మంచి ఫేమ్ వచ్చింది. అయితే బాహుబలి సినిమా కూడా ఆ స్థాయిలో ఆడినందుకు రానా చేసిన మార్కెటింగ్ స్ట్రేటజీ అంతాఇంతా కాదు. ఈరోజు తెలుసు సినిమా ప్రపంచ సినిమాతో పోటీపడుతోంది అంటే అందులో రానా గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ విషయాన్ని దర్శకధీరుడు రాజమౌళినే స్వయంగా ఒప్పుకున్నాడు మరి! ఇక బాహుబలి సిరీస్ రానా చేసిన ‘నేనే రాజు..నేనే మంత్రి’ చిత్రం కూడా కమర్షియల్ గా రానాని మరో మెట్టు ఎక్కించింది. ఇక ఆ తర్వాత ఆయన హీరో గా నటించిన అరణ్య, విరాటపర్వం వంటి సినిమాలు విడుదలయ్యాయి కానీ, అవి కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయాయి. అయితే పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో రానా చేసిన పాత్రకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

ఇక అసలు విషయంలోకి వెళితే, రానా మంచి నటుడే కాదు... అంతకుమించి మంచి హోస్ట్ కూడా. ఎటువంటి షోనైనా తనదైన రీతిలో రక్తికట్టించగలడు. ఇంతకుముందు ఆయన జెమినీ టీవీలో ప్రసారమయిన ‘నెంబర్ 1 యారి విత్ రానా’ అనే పాపులర్ టాక్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి విదితమే. ఈ టాక్ షో తర్వాత మళ్ళీ ఆయన సరికొత్త టాక్ షోతో మన ముందుకు రాబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ సంస్థ సమర్పిస్తున్న ఈ టాక్ షోకి సంబంధించి కొన్ని ఎపిసోడ్స్ ని కూడా షూట్ చేసినట్టు సమాచారం. ఈ నెల 23వ తారీఖు నుండి ఈ టాక్ షో అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: