నాగచైతన్య - సమంత గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేసావే అనే సినిమాతో సామ్, చే బాగా దగ్గరయ్యారు. కట్ చేస్తే పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. మొదట్లో వీరి కాపురం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగేది. కానీ కొంతకాలానికి వారు విడాకులు తీసుకొని దూరం అయ్యారు. అయితే వారి విడాకుల విషయం వారికి మాత్రమే కాకుండా యావత్ అక్కినేని అభిమానులకు కూడా ఎంతో బాధించింది. అక్కినేని నాగేశ్వరరావు మనవడు కావడంతో నాగచైతన్య సినిమాలకు కొదవ లేకుండా పోయింది. కానీ వారసులుగా నాగచైతన్య, అఖిల్ లు మాత్రం ఇండస్ట్రీలో వారి తాత, నాన్నకి మల్లె ఓ స్థాయిని మాత్రం అందుకోలేకపోయారనే చెప్పుకోవాలి.

ప్రస్తుతం నటి శోభిత ధూళిపాళ్లతో లవ్ లో పడి కొన్ని నెలల కిందట ఇరు కుటుంబాలను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు చైతన్య. ఈ తరుణంలో నాగచైతన్యకు సంబంధించినటువంటి ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. పైకి ఎంతో సైలెంట్ గా కనిపించే నాగచైతన్యకు ఒక దారుణమైన అలవాటు ఉందట. నాగచైతన్య బాధ కలిగినా.. ఎక్కువ సంతోషం కలిగినా.. విపరీతంగా డ్రింక్ చేస్తారని వినికిడి. అదికూడా ఎవ్వరూ లేని సీక్రెట్ ప్రదేశం కి వెళ్లి బాగా తాగి గట్టిగా అరుస్తూ తన బాధను ఎమోషనల్ గా బయటపెట్టుకుంటారట. అంతేకాకుండా బాగా తాగిన తర్వాత ఎవరికైనా ఫోన్ చేసి తన నోటికి వచ్చినట్లు మాట్లాడతారట. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది.

అది మాత్రమే కాకుండా సామ్ తో పెళ్లి తరువాత కూడా చైతన్య శోభితతో ప్రేమాయణం నెరిపాడట. దాంతో విసిగెత్తిపోయిన సమంత వారి జీవితానికి టాటా చెప్పేసింది అని సోషల్ మీడియాలో గుసగుసలు వినబడుతున్నాయి. అయితే ఈ విషయాలు తెలియని అక్కినేని అభిమానులు మాత్రం ఇప్పటికీ సామ్ పైన గుర్రుగా ఉండడం చాలా దారుణమైన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: