నటి సిల్క్ స్మిత గురించి జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు మూడు నాలుగు దశాబ్దాల క్రితం టాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు ఓ మెరుపు మెరిసిన అందాల సుందరి సిల్క్ స్మిత. ఆమె మత్తెక్కించే కళ్ళు చూసి అప్పటి కుర్రకారు గిలగిలా కొట్టుకొనేవారు. ఎక్కడో పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు సమీపంలోని కొవ్వలిలో పుట్టిన సిల్క్ స్మిత సినిమాలపై ఆసక్తితో మద్రాసులో అడుగు పెట్టి, నానా అవస్థలు పడి ఎంతో స్టార్ డం సంపాదించుకుంది. మొదట సీనియర్ హీరోయిన్ అపర్ణ ఇంట్లో పనిమనిషిగా చేరి అక్కడ నుంచి ఒక తమిళ సినిమాలో వేశ్య‌ పాత్రతో మొదటి సారిగా ఆమె వెండితెర అరంగేట్రం చేసింది. అక్కడ నుంచి ఆమె ఇక వెనుదిగిరి చూసుకోలేదు. మరీ ముఖ్యంగా ఐటెం సాంగ్ లతో ఆడి పాడి సౌత్ సినీ ఇండస్ట్రీని తన అందచందాలతో షేక్ చేసి పడేసింది.

ఈ క్రమంలో అప్పట్లో స్టార్ హీరోలు సైతం తమ సినిమాలకు అదనకు క్రేజ్ రావడం కోసం సిల్క్ స్మితతో స్పెషల్ ఐటమ్ సాంగ్స్ కావాలని అడిగేవారంటే అర్ధం చేసుకోవచ్చు. కట్ చేస్తే... ఇబ్బ‌డి ముబ్బిడిగా వచ్చిన క్రేజ్‌తో పాటు ఎన్నో ఆస్తులు రావడంతో ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఎన్నో రకాల ఒడిదుడుకులతో సాగినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆమె మద్యానికి బాగా బానిస అయిపోయింది. దీనికి తోడు ఆమె అమాయకత్వాన్ని, మంచితనాన్ని బాగా వాడుకున్న వాళ్ళు అనేకం ఆమె చుట్టూ చేరడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆమెని చాలామంది వాడుకొని మోసం చేయడంతో ఎవరిని నమ్మాలో తెలియక ఆస్తిపాస్తులు, తన డేట్లు చూసుకునేందుకు డాక్టర్ రాధాకృష్ణ అనే వ్యక్తికి ఆమె దగ్గర అయింది.

అక్కడే ఆమె నిర్ణయం తలకిందులైంది. రాధాకృష్ణ ఆమెను పూర్తిగా కట్టడి చేసుకొని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఏ సినిమాలో నటించాలన్న రాధాకృష్ణ చెబితే కానీ సిల్క్ ఒకే చేయనంత కంట్రోల్ కు తెచ్చుకున్నాడు అంటే అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఆమెతో సొంతంగా సినిమాలు కూడా తీయించాడు. ఒకటి రెండు సినిమాలు ఆడినా ఆ తర్వాత సినిమాలు ప్లాప్ కావడంతో భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ల కోసం ఆమె తన ఆస్తులు అమ్మి మరీ డబ్బులు వెనక్కు కట్టింది. అప్పటికే ఆమె ఆర్థికంగా పతనమైంది. ఇక ఆమె మద్యం మ‌త్తులో ఉండగానే రాధాకృష్ణ సిల్క్ స్మితకు చెందిన చాలా ఆస్తులను తన పేరిట రాయించుకున్నాడట. అలా ఆమె చివరకు ఎవరూ లేని అనాథ‌గా మారిపోయింది. తాను మోసపోయానన్న విషయం ఆలస్యంగా గ్రహించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని అంటారు. అయితే ఆమె మృతిపై ఎప్పటికీ అనుమానాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: