ఈ క్రమంలోనే దాదాపు మూడున్నర దశాబ్దాలుగా హీరోయిన్‌గా చేసిన ఆమె ఎన్ని కోట్ల ఆస్తి కూడ పెట్టిందనే విషయాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. అలాంటివారికోసమే ఈ కధనం. రమ్యకృష్ణ మొదటినుండి కేవలం హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్, అలాగే నరసింహ, నీలాంబరి వంటి సినిమాల్లో నెగిటివ్ పాత్రలో నటించి తన నటనతో అందరిని మెప్పించింది. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అమ్మ, అత్త వంటి పాత్రలో నటిస్తూ ముందుకు దూసుకుపోతుంది. రమ్యకృష్ణ ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ భాషలో 100కు పైనే సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసినదే. కాగా ఆమె ఆస్తి దాదాపు రూ.300 కోట్లకు పైగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె భర్త కృష్ణవంశీ ఆస్తిపాస్తులు కూడా తక్కువేం కాదు. కాగా ప్రస్తుతం రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రోజుకు రూ.10 లక్షలకు పైగా రెమ్యూనిరేషన్ తీసుకుంటుందని భోగట్టా.
ఇక చాలా గ్యాప్ తరువాత ఆమె 2012లో చేసిన బాహుబలి సినిమాలోని 'శివగామి' పాత్ర ఆమె నటనా జీవితానికే వన్నె చేకూర్చుందని చెప్పుకోక తప్పదు. కొన్ని దశాబ్దాల క్రితం రజనీతో చేసిన నరసింహ సినిమాలోని 'నీలాంబరి' పాత్ర తరువాత ఆ స్థాయి పాత్ర ఆమెకి బాహుబలి సినిమాలో లభించడంతో ఆమె పేరు మరలా దేశమంతటా మారుమ్రోగిపోయింది. ఆ తరువాత ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కూడా సజావుగా సాగిపోతోంది. ప్రస్తుతం ఆమె చెన్నైలో ఉంటున్నట్టు సమాచారం.