సాధారణంగా రెండు క్రేజీ సినిమాలు ఒకేరోజు థియేటర్లలో రిలీజ్ కావడం అరుదుగా జరుగుతుంది.దీపావళి పండుగ కానుకగా నాలుగు సినిమాలు విడుదల కాగా ఆ సినిమాలలో మూడు సినిమాలు హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చిల్డ్రన్స్ డే కానుకగా విడుదలవుతున్న కంగువా, మట్కా సినిమాలు కచ్చితంగా హిట్ గా నిలుస్తాయని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరగడం కొసమెరుపు.
 
కంగువా, మట్కా సినిమాలకు మిక్స్డ్ టాక్ రావడం అభిమానులను బాధ పెడుతోంది. ఈ రెండు సినిమాలకు క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాలేదు. స్క్రీన్ ప్లే విషయంలో రెండు సినిమాలకు సంబంధించి తప్పులు జరగడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ రెండు సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ రెండు సినిమాలు ఒకింత భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ కావడం గమనార్హం.
 
అటు కంగువా, ఇటు మట్కా హిట్ కావడం ఆయా సినీ హీరోలకు కీలకం కాగా ఈ హీరోలకు రెండు సినిమాల ఫలితాలు షాకిచ్చాయనే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు భారీ కలెక్షన్లు రావడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. కంగువా1 సినిమాకు డబ్బింగ్ సైతం మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మట్కా సినిమా పాత సీసాలో కొత్త సారా అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
 
ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ కు లక్ కలిసిరావడం లేదు. మట్కా సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు మరీ భారీ స్థాయిలో ఉండే అవకాశం అయితే లేదు. వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ మాత్రం ఒకింత భారీ స్థాయిలో ఉంది. కథల ఎంపికలో ఈ హీరో ఒకింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. కంగువా, మట్కా సినిమాలు నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కాయని భావించిన వాళ్లకు భారీ షాక్ తగిలింది. వీకెండ్ తర్వాత ఈ రెండు సినిమాలకు కలెక్షన్ల విషయంలో ఇబ్బందేనని తెలుస్తోంది.


 


మరింత సమాచారం తెలుసుకోండి: